Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్ కొత్త ప్రోమో వచ్చేసింది. ఇందులో గీతూ చేతివాటం చూపించింది. రాత్రంతా ఆమె బొమ్మలు దొంగిలించేందుకు చాలా ప్రయత్నించి, సక్సెస్ కూడా అయింది. కొత్తగా విడుదలైన ప్రోమోలో ఏముందంటే... ఇంటి సభ్యులంతా సిసింద్రీ గేమ్ ఆడుతున్నారు. వారికిచ్చని బొమ్మలను ఒంటరిగా వదలకుండా వాటిని జాగ్రత్తగా చూసుకోవడమే టాస్క్. ఆ బొమ్మలను ఎవరైనా ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ స్థానంలో పెడితే ఆ బొమ్మల తాలుకూ ఇంటి సభ్యులు ఆ టాస్క్ నుంచి వైదొలగాల్సి వస్తుంది. ఇప్పటికే ఉదయమంతా ఈ ఆటను ఆడిన ఇంటి సభ్యులు రాత్రి బొమ్మలను జాగ్రత్త తమకే కట్టుకుని పడుకున్నారు. 



రాత్రయ్యాక గీతూ గలాటా మొదలైంది. ‘చేయి లాగేస్తోంది దొంగతనం చేయాలని’ అంటూ ఇటూ అటూ తిరగడం మొదలైంది.ఆమె బాలాదిత్య బొమ్మను తీసేందుకు ప్రయత్నించింది కానీ అందరూ అడ్డుకున్నారు. ఇక శ్రీహాన్ మెల్లగా వెళ్లి అర్జున్ కళ్యాణ్ బొమ్మను తీసుకున్నాడు. అర్జున్ కి నిద్ర నుంచి తెలివి కూడా రాలేదు. శ్రీహాన్ ఆ బొమ్మను తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పెట్టేశాడు. రాత్రి మూడు గంటలైనా పడుకోకుండా చాలా మంది లేచే ఉన్నారు. గీతూ తాను ఇద్దరి  బొమ్మలు తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పింది. ఆ ఇద్దరూ ఎవరో తెలియదు. చివరికి శ్రీహాన్ బొమ్మను తీసుకెళ్లి ‘లాస్డ్ అండ్ ఫౌండ్’ లో పడేసింది. ఈ గేమ్ లో ఆమె గేమ్ ఛేంజర్ అనే చెప్పుకోవాలి. రాత్రి పూట  ఆమె చేసిన గలాటాకు సగం మంది నిద్రపోలేదు కూడా. 


ముందు రోజు కూడా ముగ్గురి బొమ్మలను గీతూ లాస్ట్ అండ్ ఫౌండ్ లో పడేసింది. దీంతో వారంతా కెప్టెన్సీ పోటీదారులు అయ్యే ఛాన్సును కోల్పోయారు. వీరిలో రేవంత్, అభినయ శ్రీ, శ్రీ సత్య ఉన్నారు.  రేవంత్ బొమ్మనే మొదట టార్గెట్ చేసింది గీతూ. ఇక శ్రీ సత్య, అభినయశ్రీ బొమ్మలను చాలా సింపుల్ గా తీసి పడేసింది.  ఆమె మాత్రం తన బొమ్మను దుస్తుల్లో దాచుకుని కాపాడుకోసాగింది. బిగ్ బాస్ దుస్తుల్లో దాచుకోకూడదని హెచ్చరించడంతో కొంతమంది నడుముకి కట్టుకున్నారు. కొందరులో చేతిలోనే గట్టిగా పట్టుకుని తిరుగసాగారు. 


వచ్చిన సమాచారం ప్రకారం ఈసారి నామినేషన్లలో ఉన్నది వీరేనని తెలుస్తోంది. 
1. రేవంత్
2. మెరీనా - రోహిత్ జంట
3. షానీ
4. ఫైమా
5. అభినయా
6. గీతూ
7. రాజశేఖర్
8. ఆదిరెడ్డి






Also read: ప్రతి ఆటలో రేవంతే టార్గెట్, మొదటి ఆటలో ఫైమా అడ్డుకుంటే, రెండోసారి గీతూ ఓడించింది


Also read: ఇతరులను గౌరవించడం నేర్చుకో అంటూ రేవంత్ పై నేహా ఫైర్, ఆ బొమ్మ కోసం ఏడ్చిన రేవంత్