వీకెండ్ వచ్చేసింది. స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ముందుగా హౌస్ మేట్స్ తో మాట్లాడారు. 'ఏంటి రేవంత్ ఏదో ఎంటర్టైన్ చేస్తున్నావ్ అందరిని' అని అడిగారు. దానికి  రేవంత్ గీతూ పుష్ఫ స్టైల్లో ఎలా నడుస్తుందో నడిచి చూపించాడు. అది చూసి అందరూ నవ్వారు. దానికి గీతూ 'నేను చాలా స్టైల్ గా నడుస్తా. వీళ్లు ఏదోలా నడుస్తున్నారు' అంది. దానికి నాగార్జున 'గీతూ నడిస్తే చాలా స్టైల్ గా ఉంటుంది' అని అన్నారు. దానికి రేవంత్ 'ఇలాగా సర్' అని మళ్లీ నడిచి చూపించారు. దానికి అందరూ నవ్వారు. 


ఆదిరెడ్డి సేఫ్: నామినేషన్స్ లో ఉన్నవారి చేతికి ఎన్విలాప్స్ ఇచ్చారు. అందులో ఆదిరెడ్డికి సేఫ్ అని వచ్చింది.  


హౌస్ మేట్స్ ని రెండు గ్రూపులుగా విడగొట్టి 'బొమ్మలతో పాట' అనే గేమ్ ఆడించారు. బొమ్మలు చూపించి, ఆ బొమ్మల ద్వారా పాటేంటో చెప్పమని అడిగారు. పాట కరెక్టుగా చెప్పాక అదే పాట వేసి ఇంటి సభ్యుల చేత చిందులు వేయించారు. ఇక గీతూని గార్డెన్ నుంచి స్టోర్ రూమ్‌కి చాలా సార్లు తిప్పుతూ విసిగించారు నాగార్జున. ఇంటి సభ్యులు మాత్రం ప్రతివారం ఇలాగే చేయమని జోకులు పేల్చారు. 


శ్రీహాన్ సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన ఏడుగురికి ఫోన్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. అందులో శ్రీహాన్ కి సేఫ్ అని వచ్చింది. 


కీర్తి, రాజ్ సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన ఆరుగురికి యాపిల్ టాస్క్ ఇచ్చి.. కీర్తి, రాజ్ సేఫ్ అని అనౌన్స్ చేశారు. 


ఎవరికి ఏ డైలాగ్:


కొన్ని రకాల డైలాగులు ఇచ్చి వాటికి తగ్గ వారిని ఎంచుకుని మెడలో వేయమని చెప్పారు నాగార్జున. బాలాదిత్య 'అవసరానికి దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు విలన్లు లేరీ నాటకంలో' అనే డైలాగ్ ఎంచుకుని గీతూ మెడలో వేశారు. దానికి నాగార్జున 'నీ ఉద్దేశంలో గీతక్క అవసరాల కోసం దారులు తొక్కుతుంది' అన్నారు. దానికి బాలాదిత్య అవునని చెప్పాడు. తరువాత ఇనయా 'సొల్లాపు దమ్ముంటే నన్నాపు' అనే డైలాగ్ తీసి సూర్య మెడలో వేసింది.


'నా పేరు శివ నాకు కొంచెం మెంటల్' అనే డైలాగ్ ను ఫైమా.. సుదీప్ మెడలో వేసింది. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అనే డైలాగ్ ను శ్రీసత్య.. బాలాదిత్యకు ఇచ్చింది. 'నా సావు నేను సస్తా నీకెందుకు' అనే డైలాగ్ కు గీతూ.. రాజ్ మెడలో వేసింది. 'నువ్ అరిస్తే అరుపులే.. నేను అరిస్తే మెరుపులు' అనే డైలాగ్ ను సుదీప.. ఫైమా కి ఇచ్చింది. 'మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది' అనే డైలాగ్ ను ఇనయాకు ఇచ్చాడు సూర్య. 


'చూడు ఒకవైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్' అనే డైలాగ్ ను ఇనయాకు ఇచ్చాడు శ్రీహాన్. గొడవ ఆపేసిందనుకుంటే మళ్లీ స్టార్ట్ చేసిందని శ్రీహాన్ అనగా.. దానికి నాగార్జున 'ఈ మధ్య ఇనయా పొద్దు తిరుగుడు పువ్వు అయిపోయింది' అన్నారు. దానికి అందరూ నవ్వారు. పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడి వైపే తిరుగుతుందనే ఉద్దేశంతో అన్నారు నాగ్. 'నా సావు నేను సస్తా' అనే డైలాగ్ ను కీర్తి.. ఆదిరెడ్డికి ఇచ్చింది. 'నువ్ అరిస్తే అరుపులే.. నేను అరిస్తే మెరుపులు' అనే డైలాగ్ ను ఆదిరెడ్డికి రోహిత్, రోహిత్ కి ఆదిరెడ్డి ఇచ్చుకున్నారు. 


మెరీనా సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన నలుగురికి వాటర్ టాస్క్ ఇచ్చి.. మెరీనా సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. 


'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అనే డైలాగ్ ను అర్జున్ కళ్యాణ్.. రేవంత్ కి ఇచ్చారు. 'ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉందింకా చూస్తావా..?' అనే డైలాగ్ ను రాజ్.. గీతూకి ఇచ్చాడు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అనే డైలాగ్ ను మెరీనా.. రోహిత్ కి ఇచ్చింది. 'చేయి చూశావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ఫాడించేస్తా' అనే డైలాగ్ ను రేవంత్.. అర్జున్ కళ్యాణ్ కి ఇచ్చారు. అదే డైలాగ్ ను వాసంతి.. రేవంత్ కి ఇచ్చింది. ఎందుకు వేశావ్ అని అడిగితే 'నన్ను పకోడా' అని పిలుస్తున్నాడు సర్ అంది. దానికి రేవంత్ 'పకోడా కాదు పకోడి' అని సరిచేశాడు. దానికి అందరూ నవ్వారు. 


గీతూ సేఫ్: నామినేషన్స్ లో మిగిలిన గీతూ, బాలాదిత్య, సుదీపలకు పూలకుండీ టాస్క్ ఇచ్చి.. గీతూ సేఫ్ అని చెప్పారు. దానికి గీతూ ఆడియన్స్ కి థాంక్స్ చెబుతూ.. ప్రతి ఇంట్లో గీతూలాంటి పిల్ల ఉంటే బావుండనిపించేలా చేస్తా సర్ అని డైలాగ్ కొట్టింది. దాంతో అక్కడున్న ఆడియెన్స్ వామ్మో వద్దే వద్దు అన్నారు. దానికి నాగార్జున 'వద్దు అని అరుస్తున్నారు ఆడియెన్స్' అని చెప్పారు. దానికి రేవంత్ కూడా 'హౌస్ లో కూడా అదే అభిప్రాయం సర్' అన్నాడు. 


సుదీప ఎలిమినేషన్: ఫైనల్ గా సుదీప, బాలాదిత్యలకు బ్యాటరీ టాస్క్ ఇచ్చి.. సుదీప ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె హౌస్ లో అందరికీ గుడ్ బై చెప్పింది సుదీప. మెరీనా, వాసంతి వెక్కి వెక్కి ఏడ్చేశారు. బాలాదిత్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. హౌస్ లో అందరినీ బాగా చూసుకుందంటూ ఎమోషనల్ అయ్యాడు బాలాదిత్య. 


స్టేజ్ పైకి వచ్చిన సుదీపకు కూరగాయల టాస్క్ ఇచ్చారు నాగార్జున. గీతూ 'వంకర టింకర' అని ఆమెకి అల్లం ఇచ్చింది. 'షార్ప్ టంగ్' అని మిర్చిని రేవంత్ కి ఇచ్చింది. 'హార్డర్ అవుట్ సైడ్.. సాఫ్ట్ ఇన్సైడ్' అనేది ఆదిరెడ్డికి ఇచ్చింది. అర్జున్ కళ్యాణ్ కి 'కన్ఫ్యూస్డ్' అని.. 'హైడింగ్ బిహైండ్ మాస్క్' అనేది శ్రీహాన్ కి ఇచ్చింది. 'లీస్ట్ లైక్డ్' అనేది ఇనయాకు ఇచ్చింది. 'ఇమ్మెచ్యూర్డ్' అనే ట్యాగ్ ఫైమాకి ఇచ్చింది. 


Also Read: 'మానాడు' రీమేక్‌లో రవితేజ - నెగెటివ్ రోల్ అంటే ఒప్పుకుంటారా?