Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కొత్త ప్రోమో వచ్చేసింది. అందులో ఫుల్ జోష్ లో కనిపించారు ఇంటి సభ్యులంతా. పాటలు, డ్యాన్సులతో హోరెత్తి పోయింది ఇల్లు. మధ్యలో ఎలిమినేషన్ టైమ్ అంటూ కంటెస్టెంట్లలో హీట్ పెంచేశారు నాగ్. 


ప్రోమోలో ఏముందంటే ... నాగార్జున ఐటెమ్ నెంబర్ అనే గేమ్ ఆడించారు. తాను చూపించిన వస్తువును బట్టి ఐటెమ్ పాటలు పాడాలని చెప్పారు. మొదట పువ్వు చూపించగానే శ్రీహాన్ ‘పూవుల్లో దాగున్న’ అంటూ అందుకున్నాడు. కానీ అది ఐటెమ్ పాట కాకపోవడంతో, రేవంత్ కు వెళ్లింది ఛాన్సు. బంతి పూల జానకి అని పాడి విన్ అయ్యాడు. తరువాత మహేష్ బాబు ఫోటో చూపించగానే ‘మ మ మహేశా’ పాటను పాడారు శ్రీహాన్. దీనికి ఆ టీమ్ మెంబర్స్ అంతా డ్యాన్సు వేశారు. ముఖ్యంగా ఆదిరెడ్డి డ్యాన్సు మాత్రం అందరికీ నవ్వు తెప్పించింది. నాగార్జున కూడా అందరినీ ఆపేయమని, తాను ఆదిరెడ్డి డ్యాన్సు చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. అతడి డ్యాన్సు ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. 






గోంగూరను చూపించగానే అర్జున్ కళ్యాణ్ ‘గోంగూర తోటకాడ కాపు కాశా’ అని పాడాడు. దీంతో వారు కాసేపు డ్యాన్సు వేశారు. మధ్యలో ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది అని హౌస్ లో హీట్ పెంచేశారు నాగార్జున. నామినేషన్లో మిగిలిన అయిదుగురిని నిల్చోబెట్టారు. దీంతో ప్రోమో ముగిసిపోయింది. 



ఎలిమినేషన్ లేనట్టే...
ఈ వీక్ ఎలిమినేషన్ కి సంబంధించి బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ సీజన్లో మొదటి వారం ఎవరినీ ఎలిమినేట్ చేయాలని భావించడం లేదని టాక్. నిజానికి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో మొదటి వారం ఎలిమినేట్ చేయకుండా ఉండలేదు. కచ్చితంగా ఇంటి నుంచి బయటికి పంపేవారు. ఈసారి మాత్రమే ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని తెలుస్తోంది. ఓటింగ్ లో లీస్టుగా అభినయశ్రీ, ఇనయా సుల్తానా, ఆరోహి రావ్ ఉన్నారు. వీరిలో అభినయశ్రీకి తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. పద్ధతి ప్రకారం అయితే ఆమె ఎలిమినేట్ అవ్వాలి అని తెలుస్తోంది. ఆదివారం ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. 


Also read: 'బిగ్ బాస్'లో ఊహించని ట్విస్ట్ - ఈ వారం ఎలిమినేషన్ లేనట్లేనా?


Also read: గీతూని నోరు అదుపులో పెట్టుకోమన్న నాగ్ - ఏడుగురిలో వారిద్దరూ సేఫ్!


Also read: ఇంట్లో బుట్టబొమ్మ ఎవరు? బాలాదిత్యను ప్రశ్నించిన నాగ్, ఎవరి పేరు చెప్పాడో గెస్ చేయండి