బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఆరో సీజన్ ను మొదలుపెట్టింది. ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. హౌస్ లోకి ఎంటర్ ఆయిన మొదటిరోజు నుంచే హౌస్ మేట్స్ గొడవ పడడం మొదలుపెట్టారు. ఐదు సీజన్లను చూసి షోలోకి రావడంతో చిన్న చిన్న విషయాలను కూడా గేమ్ పరంగా చూస్తున్నారు. కొంతమంది షోలోకి ఎంటర్ అయినప్పుడే గేమ్ మొదలెట్టేశారు. మరికొందరు మాత్రం ఇంకా పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారు.  


ఇప్పటికే రెండు వారాలను పూర్తి చేసుకుంది ఈ షో. మొదటి వారం ఎలిమినేషన్ లేనప్పటికీ.. రెండు వారం డబుల్ ఎలిమినేషన్ తో షాకిచ్చారు బిగ్ బాస్. షాని, అభినయ శ్రీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడో వారం పూర్తి కాబోతుంది. ఈ వారం కూడా హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది నిలిచారు.1. వాసంతి
2. ఆదిత్య
3. చంటి
4. ఆరోహి
5. నేహ
6. ఇనయా
7. శ్రీహాన్
8. రేవంత్
9. గీతూ


వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. దీంతో వారంతా మరింత పోటీ పడి గేమ్ ఆడుతున్నారు. ఇదిలా ఉండగా.. వీరిని సపోర్ట్ చేసే వాళ్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ ఓట్ల కోసం క్యాంపైన్ షురూ చేశారు. ఇప్పటివరకు ఇదంతా తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైంది. అయితే ఇప్పుడు సడెన్ గా నామినేషన్ లిస్ట్ లో ఉన్న నేహా చౌదరిని కాపాడడం కోసం లెజండరీ క్రికెటర్ బ్రియన్ లారా రంగంలోకి దిగారు. 


సోషల్ మీడియా వేదికగా నేహాకి ఓట్లు వేయాలని కోరారు. బ్రియన్ లారా లాంటి స్టార్ క్రికెటర్ నేహా చౌదరికి సపోర్ట్ చేయడమేంటని.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడి ఉంటుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నేహా చౌదరి ఇదివరకు యాంకర్ గా, స్పోర్ట్స్ ప్రెజంటర్ గా పని చేశారు. ఇండియా క్రికెట్ మ్యాచ్ లకు తెలుగు కామెంట్రీ చేసే వ్యక్తుల్లో నేహా కూడా ఉన్నారు. అలా కామెంట్రీ చెప్పే సమయంలోనే బ్రియన్ లారాతో నేహాకి పరిచయం ఏర్పడి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆమెని సపోర్ట్ చేయడానికి బ్రియన్ లారా ముందుకొచ్చారు. మరి బ్రియన్ లారా సపోర్ట్ నేహాను కాపాడుతుందేమో చూడాలి! 


Also Read : బాబాయ్‌ వెంకీ తలకి గన్ గురి పెట్టిన రానా- క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'రానా నాయుడు' టీజర్ రిలీజ్


Also Read : లక్ష్మీ మంచు ఈజ్ బ్యాక్ - త్వరలో 'షెఫ్ మంత్ర 2' షురూ!