పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ డీల్స్ గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. నాన్ థియేట్రికల్ హక్కులే ఏకంగా రూ.70 కోట్ల వరకు అమ్ముడుపోయాయని వార్తలు వస్తున్నాయి.
భీమ్లానాయక్ తెలుగు శాటిలైట్ హక్కులను స్టార్ మా, డిజిటల్ హక్కులను డిస్నీప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేశాయి. అయితే సినిమా విడుదల అయిన ఎన్ని రోజుల తర్వాత ఓటీటీలో రానుందన్న సంగతి మాత్రం తెలియరాలేదు.
సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రం అందిస్తున్నారు. థమన్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ, నైట్ కర్ఫ్యూ తీసేస్తేనే భీమ్లా వస్తుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ గతంలోనే తెలిపారు.