రుణ్ ధావన్, కృతిసనన్ హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ‘భేడియా’. అమర్ కౌళిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ వరుస అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలతో  అత్యంత ఆసక్తికరంగా ఉంది.

  


తోడేలుగా వరుణ్ ధావన్


‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, ‘బద్లాపూర్‌’, ‘స్ట్రీట్ డ్యాన్సర్’ సహా పలు అద్భుత సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ ధావన్. తొలి నుంచి కథా బలం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తుస్తున్నాడు. జయాపజయాలతో పని లేకుండా హిందీ పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు. ఓ భారీ హిట్ తో మళ్లీ ట్రాల్ లోకి రావాలి అనుకుంటున్నాడు.


ఈ నేపథ్యంలోనే ఆయన నటించిన తాజా సినిమా ‘భేడియా’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  హిందీలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. తోడేలు కరవడంతో వరుణ్ తోడేలు మాదిరిగానే మారిపోతుంటాడు. తోడేలుగా  మారిన తర్వాత వరుణ్‌ తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమాను తెరెక్కించినట్లు ఇందులో తెలుస్తున్నది.


తోడేలు కరిచిన దగ్గర నుంచి వరుణ్ రాత్రిపూట తోడేలుగా మారిపోతుంటాడు. పగటి వేళల్లో జరిగే ఘటనలను గుర్తు చేసుకుని భయంతో వణికిపోతుంటాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విపరీతమైన ఆసక్తి  కలిగించింది. కామెడీ హార్రర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మడాక్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై దినేష్ విజయ్‌  నిర్మిస్తున్నాడు.  దినేష్ విజన్‌.. హార్రర్‌ కామెడీ యూనివర్స్‌ లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ గా ఈ చిత్రం రూపొందింది. గతంలో ఈ యూనివర్స్‌ లో తెరకెక్కిన ‘స్త్రీ’, ‘రూహీ’ సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి.   


టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం


బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ లోనూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, హిందీతో పాటు తెలుగులోనూ ఆయన సినిమాలను విడుదల చేస్తున్నారు. గతంలో  ‘క్రిష్‌’ సిరీస్‌, ‘ధూమ్‌-3’, ‘డర్టీ పిక్చర్‌’ లాంటి పలు సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. తాజాగా రణ్‌బీర్‌  నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ధావన్ తాజా సినిమా ‘భేడియా’ కూడా తన లక్ పరీక్షించుకోడానికి తెలుగులోకి అనువాదమై వస్తోంది. మరి, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారో.. లేదో చూడాలి. 


Read Also: ‘బాహుబలి-2’లోని ఆ సీన్‌ను దించేసిన ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్’ వెబ్ సీరిస్, ఇండియన్ డైరెక్టర్ పనే!


‘బేడియా’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి: