5 Best Wrist Watches For Swimmers: సాధారణంగా మీరు స్విమ్మింగ్‌కు వెళ్లినప్పుడు కానీ, వర్షంలో తడిచినప్పుడు కానీ స్మార్ట్ వాచ్ తీసి పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ స్మార్ట్ వాచ్‌ల విషయంలో అలా చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్లో చాలా స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి గొప్ప ఫీచర్లను కలిగి ఉంటాయి. వాటర్‌ప్రూఫ్‌గా కూడా ఉన్నాయి. నీటి అడుగున కూడా దీని సహాయంతో అనేక విషయాలను అన్వేషించే విధంగా ఈ స్మార్ట్ వాచ్‌లను రూపొందించారు. ఈ విషయంలో టాప్ 5 స్మార్ట్ వాచ్‌లు ఏంటో చూద్దాం.
యాపిల్ వాచ్ అల్ట్రా 2
వీటిలో మొదటి వాచ్ పేరు యాపిల్ వాచ్ అల్ట్రా 2. ఇది వాచ్ఓఎస్ 10పై నడుస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధృఢమైన టైటానియం కేస్‌తో రానుంది. తద్వారా మీరు దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉపయోగించవచ్చు. ఇందులో రీ-డిజైన్ చేసిన యాప్‌లు, కొత్త స్మార్ట్ స్టాక్, కొత్త సైక్లింగ్ అనుభవం, అవుట్‌డోర్ డిటెక్షన్ ఫీచర్‌లు, కొత్త వాచ్ ఫేస్ - మాడ్యులర్ అల్ట్రాని అందించారు. యాపిల్ వాచ్ అల్ట్రా 2 రెగ్యులర్ యూసేజ్‌తో గరిష్టంగా 36 గంటల బ్యాటరీ లైఫ్‌ని, లో పవర్ మోడ్‌లో 72 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఈ వాచ్ ధర రూ.89,899.
నాయిస్ కలర్ ఫిర్ పల్స్ గ్రాండ్
ఈ వాచ్‌లో 1.69 అంగుళాల ఎల్సీడీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. ఇందులో 60 స్పోర్ట్స్ మోడ్‌లు అందించారు. ఇది హృదయ స్పందన రేటు, ఎస్పీవో2ని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. ఈ వాచ్ నాయిస్ ఫిట్ యాప్ సహాయంతో పని చేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు వారి ఫిట్‌నెస్‌ని ట్రాక్ చేయవచ్చు. నాయిస్ కలర్‌ఫిర్ పల్స్ గ్రాండ్ ధర గురించి మాట్లాడితే, దీనిని అమెజాన్‌లో రూ. 1,199కి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, నాయిస్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆలివ్ గ్రీన్, షాంపైన్ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ, జెట్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.
వెర్వ్ కనెక్ట్ అల్ట్రా వాచ్
వెర్వ్ కనెక్ట్ అల్ట్రా 1.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌తో వస్తుంది. మీరు అన్ని ప్రాథమిక ఫిట్‌నెస్, ఆరోగ్య ట్రాకింగ్ ఫీచర్‌లను పొందుతారు. వాచ్‌లో స్లీప్ ప్యాటర్న్ ట్రాకర్, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్ మానిటర్,యు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ సెన్సార్ ఉన్నాయి. ఇది కాకుండా వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, హైకింగ్, బాస్కెట్‌బాల్, స్విమ్మింగ్ వంటి 120 కంటే ఎక్కువ క్రీడలు, ఎక్సర్‌సైజ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు హెల్త్, ఫిట్‌నెస్‌ని సులభంగా ట్రాక్ వేయవచ్చు. మీరు ఈ వాచ్‌ని అమెజాన్ నుంచి 899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
పెబుల్ కాస్మోస్ ఎండ్యూర్
ఈ వాచ్ 1.46 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్, ఐపీ68 రేటింగ్ కూడా ఉంది. సరళంగా చెప్పాలంటే ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పవచ్చు. దీనిలో మీరు మూడు కలర్ ఆప్షన్లను పొందుతారు. అవి నీలం, ఆకుపచ్చ, నలుపు. అమెజాన్‌లో దీని ధర రూ. 4,799గా ఉంది. ఇది స్లీప్ సైకిల్, బీపీని కొలవడానికి కూడా పనిచేస్తుంది.
శాంసంగ్ వాచ్ 6 క్లాసిక్
శాంసంగ్ వాచ్ 6 క్లాసిక్ సిరీస్ 47 ఎంఎం, 43 ఎంఎం వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటిలో 300 ఎంఏహెచ్, 400 ఎంఏహెచ్ బ్యాటరీలు కూడా ఉన్నాయి. శాంసంగ్ వాచ్ 6 క్లాసిక్... ఎక్సినోస్ డబ్ల్యూ930 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది హృదయ స్పందన రేటు, ఆక్సిజన్, స్లీప్ ట్రాకింగ్ వంటి ముఖ్యమైన ఫిట్‌నెస్ ట్రాకర్‌లను కూడా కలిగి ఉంది. ఈ వాచ్ ధర రూ.33,299.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?