యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటించిన చిత్రం 'బెదురులంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. ఈ రోజు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు (Teaser launched by Vijay Devarakonda).
టీజర్ ఎలా ఉందనేది చూస్తే...డిసెంబర్ 31, 2012లో యుగాంతం వస్తుందని అందమైన గోదావరి తీరంలోని ఓ పల్లెలో ప్రజలు ఏం చేశాడనేది 'బెదురులంక 2012' కథ. హీరో కార్తికేయ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. హీరోయిన్ నేహా శెట్టి సైతం లంగా ఓణీలు, సాంప్రదాయ దుస్తుల్లో ముద్దొచ్చేలా ఉన్నారు. 'నేనొక మాస్టర్ ప్లాన్ చెబుతాను... విను' అని అజయ్ ఘోష్ ఒక డైలాగ్ చెప్పారు. బైబిల్, భగవద్గీతను కూడా ఆయన వాడేశారు. ఎలా? అది ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
'నా కోసం సిగరెట్ మానేస్తావా? లేదా?' అని కార్తికేయను నేహా శెట్టి అడిగితే... 'దీనిని మించిన కిక్ ఏదైనా నాకు దొరికితే అప్పుడు మానేస్తా' అని బదులు ఇస్తారు. ఆ కిక్ లిప్ లాక్ అని ఇన్ డైరెక్టుగా చెప్పారు. ఆ తర్వాత కిక్ కావాలంటూ అమ్మాయి వెంట పడటం రొమాంటిక్ గా ఉంది. కంటెంట్ అండ్ కామెడీ ఉన్న సినిమా అని టీజర్ చూస్తే తెలుస్తోంది.
Also Read : 'పాప్ కార్న్' రివ్యూ : ప్రేమ కథకు డైపర్ వేశారుగా - అవికా గోర్ సినిమా ఎలా ఉందంటే?
యుగాంతం వస్తే? ఓ పల్లెటూరి, గోదావరి లంక గ్రామంలోని ప్రజలు ఏం చేశారు? అనే కథాంశంతో 'బెదురులంక 2012' రూపొందింది. క్లాక్స్ దర్శకత్వంలో సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మిస్తున్నారు. ఆయన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థలో మూడో చిత్రమిది. 'కలర్ ఫోటో' చిత్రాన్ని నిర్మించింది ఆయనే.
ఉగాదికి 'బెదురులంక'!
ఉగాది సందర్భంగా మార్చి 22న 'బెదురులంక 2012'ను విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారట. ఉగాది బుధవారం వచ్చింది. ఆ రోజు సెలవు ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రేక్షకులు ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు. బుధ, గురు తర్వాత శుక్ర, శని, ఆది వారాలు వీకెండ్. అంటే... లాంగ్ వీకెండ్ మీద ఈ సినిమా కన్నేసింది.
Also Read : 'అమిగోస్' రివ్యూ : కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
విశాలమైన గోదావరి... నది తీరమంతా పచ్చటి కొబ్బరి చెట్లు... బండి మీద 'రయ్ రయ్...' మంటూ దూసుకు వెళుతున్న హీరో కార్తికేయ... చక్కటి లంగా ఓణీలో హీరోయిన్ నేహా శెట్టి... సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రాంప్రసాద్ క్యారెక్టర్లను కూడా దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. ఊరిలో జనాలంతా యుగాంతం వస్తుందని ఎంజాయ్ చేసే తీరు నవ్వించేలా ఉంది.
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు & సన్నీ కూరపాటి, నృత్యాలు : బృంద, మోయిన్, సంగీతం : మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ : సి. యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం : క్లాక్స్.