Umapathi Telugu Movie: అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన 'వధువు' వెబ్ సిరీస్ ఈ మధ్య ఓటీటీలో విడుదలైంది. వీక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడు వెండితెరపై ఇయర్ ఎండ్ ధమాకా ఇవ్వడానికి అన్నట్లు తన కొత్త సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
పల్లెటూరి అమ్మాయిగా అవికా గోర్!
అవికా గోర్ ఉత్తరాది అమ్మాయి. తొలుత 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్, ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. అవికా గోర్ తొలి తెలుగు సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. తర్వాత మరికొన్ని సినిమాల్లో సైతం గ్రామీణ యువతిగా కనిపించారు. ఇప్పుడు మరోసారి పల్లెటూరి అమ్మాయి రోల్ చేస్తున్నారు.
అవికా గోర్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించిన తాజా సినిమా 'ఉమాపతి'. క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వర రావు నిర్మించారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామి. ఇందులో అనురాగ్ హీరోగా నటించారు. సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా (Umapathi Telugu Movie Release Date). తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.
Also Read: కళ్యాణ్ రామ్ 'డెవిల్' చూసిన 'దిల్' రాజు - 'బింబిసార' సెంటిమెంట్ రిపీట్!
రెండు పల్లెటూళ్ళ మధ్య గొడవ...
జులాయితో అమ్మాయి ప్రేమకథ!
Umapathi Telugu Movie Trailer Review: 'ఉమాపతి' ట్రైలర్ చూస్తే... ఎప్పుడూ తండ్రితో తిట్లు తినే యువకుడిగా హీరో అనురాగ్ కనిపించారు. లంగా ఓణీలో కాలేజీకి వెళ్లే అమ్మాయిగా అవికా గోర్ పల్లెటూరి పడుచు పాత్రలో ఒదిగిపోయారు. ఒకవైపు వీళ్ళిద్దరి ప్రేమ కథ నడుస్తుంటే... మరో వైపు పోసాని కృష్ణమురళి ట్రాక్ కూడా చూపించారు.
రెండు పల్లెటూళ్ళ మధ్య గొడవ హీరో హీరోయిన్ల ప్రేమకు ఏ విధంగా అడ్డు పడింది? అప్పుడు యువ జంట ఏం చేశారు? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ప్రేక్షకులకు కామెడీ అందించడమే ప్రధాన ఉద్దేశంతో సినిమా తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'ఫిదా'కు అద్భుతమైన పాటలు అందించిన శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందించారు. టాప్ టెక్నీషియన్లు వర్క్ చేశారు. మరి, సినిమా ఎలా ఉంటుందో చూడాలి. కథానాయికగా, నిర్మాతగా అవికా గోర్ హిట్ అందుకుంటారా? లేదా? అనేది వెయిట్ అండ్ సీ.
Also Read: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్
అనురాగ్, అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, 'జబర్దస్త్' ఫేమ్ 'ఆటో' రామ్ ప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకుడు: వెంకట్ ఆరే, కూర్పు: గౌతమ్ రాజు - నాని, పాటలు: 'ఆస్కార్' పురస్కార గ్రహీత చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కరభట్ల రవికుమార్, ఛాయాగ్రహణం: రాఘవేంద్ర, స్వరాలు: శక్తికాంత్ కార్తీక్, నేపథ్య సంగీతం : జీవన్ బాబు, నిర్మాత: కె. కోటేశ్వరరావు, దర్శకత్వం: సత్య ద్వారపూడి.