అర్జున్ సర్జా (Arjun Sarja) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన్ను 'యాక్షన్ కింగ్' అంటుంటారు. ఆయన హీరో మాత్రమే కాదు... దర్శకుడు, నిర్మాత. ఆయన దర్శకత్వంలో కుమార్తె ఐశ్వర్యను తెలుగుకు పరిచయం చేస్తూ...  విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ చేశారు. రెండు మూడు రోజులుగా ఈ ప్రాజెక్టుపై రూమర్స్ వినిపిస్తున్నాయి. సినిమా నుంచి హీరో తప్పుకొన్నారనే మాటలు వినిపించాయి. అసలు, తెర వెనుక ఏం జరిగిందో అర్జున్ వివరించారు.
 
మొదటి నుంచి విశ్వక్ సేన్ ప్రవర్తన బాలేదు : అర్జున్
కథ నేరేట్ చేసినప్పుడు తనకు పిచ్చి పిచ్చిగా నచ్చిందని విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పారని అర్జున్ తెలిపారు. ఆ తర్వాత ఆయన తనను, తన చిత్ర బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టారని యాక్షన్ కింగ్ పేర్కొన్నారు. విశ్వక్ సేన్ చెప్పిన టైమ్‌కు షూటింగ్‌కు రాలేదన్నారు. ఆయన ప్రవర్తన వల్ల రెండు సార్లు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశామన్నారు.


దర్శకుడిగా, నిర్మాతగా హార్ట్ అయ్యా!
కథ నేరేట్ చేసిన తర్వాత విశ్వక్ సేన్ ఒక రెమ్యూనరేషన్ చెప్పారని... తాను అంత ఇవ్వలేనని చెప్పానని అర్జున్ తెలిపారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చామని, ఓ ఏరియా రైట్స్ ఇవ్వమని అడిగితే సరే అన్నానని, కొంత అడ్వాన్స్ ఇచ్చానని ఆయన వివరించారు. ఆ తర్వాత స్టోరీ డిస్కషన్స్ కోసం ఎన్ని ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్‌ని పంపిద్దామని ఫోన్స్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. తన జీవితంలో అన్ని కాల్స్ ఎవరికీ చేయలేదన్నారు. తాను గానీ, తన టీమ్ గానీ తప్పు చేయలేదన్నారు. విశ్వక్ సేన్‌కు ప్రొఫెషనలిజం లేదన్నారు. దర్శక, నిర్మాతలు అంటే అసలు గౌరవం లేదన్నారు. తానొక దర్శకుడిగా, నిర్మాతగా హార్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు. 


ఒకసారి విదేశాలు వెళ్లి వచ్చానని, స్కిన్ ట్యాన్ అవ్వడం వల్ల కొంత రెస్ట్ తీసుకుని ఫ్రెష్‌గా సెట్‌కు వస్తానంటే ఓకే అన్నామని, షెడ్యూల్  క్యాన్సిల్ చేశానని అర్జున్ చెప్పారు. ఆ తర్వాత మరోసారి కొత్త షెడ్యూల్ వేస్తే... తెల్లవారితే షూటింగ్ అనగా, ఉదయం నాలుగు గంటలకు క్యాన్సిల్ చేయమని విశ్వక్ సేన్ నుంచి మెసేజ్ వచ్చిందని ఆయన తెలిపారు. వర్క్ పట్ల విశ్వక్ సేన్‌కు కమిట్మెంట్ లేదన్నారు. తనకు వంద కోట్లకు వస్తాయని చెప్పినా... ఎప్పటికీ అతనితో సినిమా చేయనని చెప్పేశారు. 


దర్శకుడిగా తనకు ఒక విజన్ ఉంటుందని, టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులు, చంద్రబోస్ రాసిన పాటలు నచ్చలేదని మధ్యలో ఇబ్బంది పెట్టారని, అతని ప్రవర్తన ఏమాత్రం బాలేదని అర్జున్ వివరించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్, నిర్మాతల మండలిలో విశ్వక్ గురించి కంప్లయింట్ చేస్తున్నామని, తనకు జరిగినట్టు మరొకరికి జరగకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. తనది మంచి కథ అని, త్వరలో మరొక హీరోతో సినిమా తీస్తామన్నారు. 


Also Read : 'కొరమీను' కథలో మీసాలు ఎక్కడ తీసేశారో తెలిసింది