Arjun Kapoor sells his 4BHK Bandra flat for Rs 16 crore: బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇరవై కోట్లు విలువ చేసే తన ఇంటిని నష్టాలకు అమ్మేశారు. గతేడాది అర్జున్ కపూర్ ముంబైలోని ఓ లగ్జరీ ఏరియాలో అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. మొత్తం రూ.20 కోట్లకు ఈ ఫ్లాట్ ను సొంతం చేసుకున్నారు అర్జున్ కపూర్. అయితే ఇప్పుడు రూ.16 కోట్లకే దీన్ని అమ్మేశారట. ఏడాది వ్యవధిలో నాలుగు కోట్ల నష్టానికి ఎందుకు అమ్మేశారనేది బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

నిజానికి అర్జున్ కపూర్ ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి కారణమేంటంటే.. అతడి ప్రేయసి మలైకా అరోరా(Malaika Arora) ఈ ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది. మలైకా ఇంటి సమీపంలో భారీ ధర పలికే ఈ ఫ్లాట్ ను అర్జున్ 2021లో కొన్నాడు. మలైకాకు దగ్గరగా ఉండడం కోసమే ఈ ఇంటిని అతడు కొన్నాడనే విషయం ఇప్పుడు హైలైట్ అవుతోంది. అదే ఇంటిని నష్టాలకు అమ్మేయడంతో మళ్లీ అర్జున్-మలైకా ప్రేమ వ్యవహారం వార్తల్లో నిలిచింది. 

 

తనకంటే వయసులో పెద్దదైన మలైకాతో చాలా కాలంగా రిలేషన్ లో ఉన్నారు అర్జున్ కపూర్. మొన్నామధ్య వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని కొట్టిపారేసింది ఈ జంట. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రచారమే జరుగుతోంది. మరి దీనిపై అర్జున్,మలైకా స్పందిస్తారేమో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అర్జున్ కపూర్ నటించిన 'ఏక్ విలన్ రిటర్న్స్'(Ek Villain Returns) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.