ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ పెద్ద కూతురు ఖతీజా రెహ్మాన్ వివాహం వైభవంగా జరిగింది. రియాస్దీన్ షేక్ మహమ్మద్ అనే సౌండ్ ఇంజనీర్‌తో మే5న ఆమెకి వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రెహ్మాన్.
పలువురు ప్రముఖులు సహా.. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రీసెంట్ గా కూతురి కోసం మ్యూజికల్ వెడ్డింగ్ రిసెప్షన్ ను నిర్వహించారు రెహ్మాన్. ఇదిలా ఉండగా.. ఇప్పుడు తన కూతురి పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెహ్మాన్ కూతురు ఖతీజా కూడా సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. 2010లో విడుదలైన 'రోబో'సినిమాలో 'ఓ మరమనిషి' పాటను దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆలపించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన కృతిసనన్ 'మీమీ' చిత్రంలో 'రాక్ ఏ బై బేబీ' పాటను పాడారు.
Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!
Also Read: 'స్క్విడ్ గేమ్' ఈజ్ రిటర్నింగ్ - గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్