అనుష్క శెట్టి (Anushka Shetty) అసలు పేరు స్వీటీ. పేరుకు తగ్గట్టు ఆమె మనసు కూడా ఎంతో స్వీట్ అని ఇండస్ట్రీలో జనాలు చెబుతుంటారు. మొన్న సోమవారం (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు. మరి, బర్త్ డేకి చాలా రోజుల ముందు వెళ్లారో? లేదంటే బర్త్ డే సెలబ్రేషన్స్ అండ్ సినిమా షూటింగ్ వచ్చేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారో? గానీ... ఇప్పుడు లండన్‌లో ఉన్నారు.
 
లండన్‌లో అనుష్క48
అనుష్క(Anushka), నవీన్ పోలిశెట్టి .(Naveen Polishetty) ప్రధాన పాత్రల్లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా యూనిట్ యూకేలో ఉంది. ఈ రోజు లేదంటే రేపు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సుమారు పది రోజులు లండన్‌లో షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు జరిగాయి. లండన్ సిటీతో పాటు శివార్లలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.అనుష్కకు 48వ చిత్రమిది. 
 
లండన్ తర్వాత హైదరాబాద్!
లండన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత అనుష్క అండ్ టీమ్ హైదరాబాద్ వస్తుంది. ఇక్కడ పది పదిహేను రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాంతో టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ కానుంది. ఆ తర్వాత ఒకటి లేదా రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలన్స్ ఉంటాయని, వాటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. 


అనుష్క... ఇంటర్నేషనల్ షెఫ్!
ఈ సినిమాలో అనుష్క షెఫ్ రోల్ చేస్తున్నారు. అదీ ఇంటర్నేషనల్ షెఫ్! ఆమె బర్త్ డే సందర్భంగా అన్విత రవళి శెట్టి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే, అనుష్క వంట చేస్తున్న స్టిల్ కూడా విడుదల చేశారు.


Also Read : 'యశోద' రివ్యూ : అసలు కథ వేరే బాస్ - సమంత షీరోయిజం ఎలా ఉందంటే?
 





యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. వాటి తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. త్వరలో సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.


అనుష్క బ్యాక్ గ్రౌండ్:
అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలిగా ఉండేది. అనుకోకుండా నాగార్జున నటించిన సూపర్ చిత్రంలో రెండో హీరోయిన్ ఛాన్సు కొట్టేసింది. ఆ సినిమాలో ఆమెను తొలిసారి చూసిన వాళ్లంతా ‘వావ్ ఎవరీ అమ్మాయి?’ అనుకున్నారు. హీరోలతో సమానమైన ఎత్తుతో, సన్నని మల్లెతీగలా ఉంది ఆ సినిమాలో. ఇక విక్రమార్కుడు సినిమాలో ఆమె డ్యాన్సులు జనాలకు విపరీతంగా నచ్చేశాయి. ఆమెను టాప్ హీరోయిన్ గా నిలబెట్టిన సినిమా అయితే ‘అరుంధతి’ అనే చెప్పాలి. అనుష్క కెరీర్ అరుంధతికి ముందు, తరువాత అనేంతగా మారింది. అప్పట్నించి లేడీ ఓరియంటెడ్ మూవీ అనగానే అందరికీ అనుష్కనే గుర్తొచ్చేది. 2005లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనుష్క వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా కెరీర్ సాగుతోంది. ఇక ఆమె కెరీర్ లో బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆమె కెరీర్లో 2005 నుంచి 2020 వరకు వరుస పెట్టి ప్రతి ఏడాది రెండుకి మించి ఆమె సినిమాలు విడుదలయ్యేవి. 2010లో అయితే ఏకంగా 8 సినిమాలు విడుదలయ్యాయి. అయితే 2021లో మాత్రం బ్రేక్ తీసుకుంది అనుష్క. ఆ ఏడాది ఒక్కసినిమా కూడా విడుదల కాలేదు. ఈ ఏడాది కూడా ఆమె నుంచి సినిమా వచ్చేలా లేదు.