టాాలీవుడ్ లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఆయన హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో సిద్దు నటన, కామెడీ కి వంద శాతం మార్కులు పడ్డాయి. దీంతో యూత్ లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్దు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా ప్రాంభమైనట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ‘డిజే టిల్లు’ మొదటి పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. మూవీలో నేహా గ్లామర్, నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ‘డిజే టిల్లు’ సీక్వెల్ పార్ట్ లో హీరోయిన్స్ ను మార్చడం వలన సిద్దుకు జోడి ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. 


మొదటి పార్ట్ లో చేసిన హీరోయిన్ నేహాశెట్టి నే సీక్వెల్ కూడా కొనసాగిస్తారు అనుకున్నారు. కానీ ఆమెను సినిమా మొదట్లోనే సైడ్ చేశారు. తర్వాత ‘పెళ్లి సందD’ ఫేమ్ శ్రీలీల ను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఆమెను కూడా మార్చేశారని అన్నారు. శ్రీలీల కూడా తప్పుకోవడంతో తర్వాత మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ నడిచింది. తర్వాత అందుకు సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా చేశారు మేకర్స్. ఏమైందో ఏమో తెలీదు గానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి అనుపమ కూడా తప్పుకున్నట్టు సమాచారం. ఈమె కూడా వెళ్లిపోవడంతో మూవీలో హీారోయిన్ ఎవరు అనేది తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారట ‘డిజే టిల్లు’ ఫ్యాన్స్. 


అయితే మళ్లీ ఈ సీక్వెల్ లో మరో హీరోయిన్ ను తీసుకొచ్చారట మేకర్స్. ‘ప్రేమమ్’ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించగా ఓకే చెప్పిందని తెలిసింది. మడోనా తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో చేసింది. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాతో ఈ భామ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత హీరో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కొద్దిసేపు కనిపించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ‘టిల్లు స్క్వేర్’ సినిమా కథ విన్న తర్వాత బాగా నచ్చేయడంతో వెంటనే ఓకే చెప్పేసిందట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ హీరోయిన్ అయినా సినిమా పూర్తయ్యేదాకా ఉంటుందా లేదా అనేది సందేహమే అంటున్నారు నెటిజన్స్. 


Read Also: కోలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి సందడి, మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన గౌతమ్, మంజిమా