'జోహార్'లో నటించిన అంకిత్ కొయ్య (Ankith Koyya Actor) గుర్తు ఉన్నారా? ఆ సినిమాలో ఎస్తర్ అనిల్‌కు జోడీగా నటించారు. ఇక, సత్యదేవ్ కథానాయకుడిగా 'తిమ్మరుసు'లో కీలక పాత్ర చేశారు. '9 అవర్స్' వెబ్ సిరీస్‌లోనూ నటించారు. నాగశౌర్య 'అశ్వథ్థామ'లో విలన్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఇప్పుడు వెండి తెరపైకి కథానాయకుడిగా వస్తున్నారు అంకిత్.
అంకిత్ కొయ్య కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'జాన్ సే' (Jaan Say Movie). వైఏఎస్ వైష్ణవి సమర్పణలో కృతి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తోంది. దీనికి ఎస్. కిరణ్ కుమార్ దర్శకుడు, నిర్మాత. ఆయనకు తొలి చిత్రమిది. కృతి సంస్థలో కూడా ఇందులో తన్వీ నేగి కథానాయిక. ఈ మధ్య డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయిన 'ఐరావతం' సినిమాలో ఆమె డ్యూయల్ రోల్ చేశారు.
ప్రణయ్ పాత్రలో అంకిత్!
'జాన్ సే'లో ప్రణయ్ పాత్రలో అంకిత్ నటించినట్లు దర్శక నిర్మాత ఎస్. కిరణ్ కుమార్ వెల్లడించారు. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యిందని ఆయన తెలిపారు.
ఇంకా ఎస్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ ''జాన్ సే... టైటిల్ లో మూడు చుక్కలు ఉన్నాయి కదా! అవి సినిమాలో కీలకమైన మూడు పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్... ప్రణయ్ పాత్రను ఇప్పుడు పరిచయం చేశాం. హీరోది లవర్ బాయ్ రోల్. మిగతా రెండు డాట్స్ (రెండు క్యారెక్టర్లను) త్వరలో పరిచయం చేస్తాం. జనవరి మొదటి వారంలో తొలి పాటను సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసి వేసవి కానుకగా ఐదు భాషల్లో సినిమాను విడుదల చేస్తాం'' అని ఎస్. కిరణ్ కుమార్ చెప్పారు.
Also Read : సోహైల్ అంటే పిచ్చి, ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తా - ప్రపోజ్ చేసిన 'బిగ్ బాస్' ఇనయా
''ఇదొక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అయినప్పటికీ... థ్రిల్లింగ్ అంశాలతో పాటు హీరో హీరోయిన్లు అంకిత్ కొయ్య, తన్వి నేగి మధ్య ప్రేమకథ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు అయినప్పటికీ... సినిమాలో సుమన్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ యాక్టర్లు ఉన్నారు. రూ. 10 కోట్ల నిర్మాణ వ్యయంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం'' అని చిత్ర బృందం పేర్కొంది.
Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?
అంకిత్, తన్వి నేగి, సుమన్, అజయ్, తనికెళ్ళ భరణి, సూర్య, భాస్కర్, రవి వర్మ, అయేషా, రవి శంకర్, లీల, బెనర్జీ, రవి గణేష్, రమణి చౌదరి, వంశీ, అంజలి, కిరణ్ కుమార్, ఎ.కె. శ్రీదేవి, ప్రశాంత్ సమలం, వేణుగోపాల్, తేజ, సంతోష్, వి జే లక్కీ, శ్రీను, అరుణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్ : ఎ.జె. ఆర్ట్స్ (అజయ్), కూర్పు : ఎం.ఆర్. వర్మ, పాటలు : విశ్వనాథ్ కరసాల, మాటలు : పి. మదన్, ఛాయాగ్రహణం : మోహన్ చారీ, సంగీతం : సచిన్ కమల్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఎస్. కిరణ్ కుమార్.