'జోహార్'లో నటించిన అంకిత్ కొయ్య (Ankith Koyya Actor) గుర్తు ఉన్నారా? ఎస్తర్ అనిల్‌కు జోడీగా నటించారు. సత్యదేవ్ హీరోగా 'తిమ్మరుసు'లో కీలక పాత్ర చేశారు. '9 అవర్స్' వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. సినిమాల్లో కీలక పాత్రలు చేసిన అంకిత్ కొయ్య, ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నారు.
అంకిత్ కొయ్య హీరోగా రూపొందుతోన్న సినిమా 'జాన్ సే' (Jaan Say Movie). కృతి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆ సంస్థలో తొలి చిత్రమిది. దీనికి ఎస్. కిరణ్ కుమార్ దర్శకుడు. ఆయనకూ ఇదే తొలి సినిమా. ఇందులో తన్వీ నేగి (Tanvi Negi) హీరోయిన్. ఈ మధ్య డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల అయిన 'ఐరావతం' సినిమాలో ఆవిడ డ్యూయల్ రోల్ చేశారు.'జాన్ సే' సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా టైటిల్ లోగో, వర్కింగ్ స్టిల్స్ విడుదల చేశారు.
న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్... జాన్ సే!
''ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ సరికొత్త దశలో అడుగు పెడుతోంది. కొత్త కథలతో, విభిన్నమైన కథాంశాలతో రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. అటువంటి చిత్రమే 'జాన్ సే'. న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. చిత్ర పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేకపోయినా... కేవలం సినిమా మీద ప్యాషన్‌తో కిరణ్ కుమార్ మంచి కథ రెడీ చేసుకున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీస్తున్నారు'' అని కృతి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ పేర్కొంది.
నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి!
''ఇదొక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అయినప్పటికీ... థ్రిల్లింగ్ అంశాలతో పాటు హీరో హీరోయిన్లు అంకిత్ కొయ్య, తన్వి నేగి మధ్య ప్రేమకథ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపుగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ పూర్తవుతుంది. హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళు అయినప్పటికీ... సినిమాలో సుమన్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ యాక్టర్లు ఉన్నారు. రూ. 10 కోట్ల నిర్మాణ వ్యయంతో ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం'' అని దర్శకుడు కిరణ్ కుమార్ తెలిపారు.
Also Read : 'మీట్ క్యూట్', 'కాంతార' to 'చుప్', 'ప్రిన్స్' - ఓటీటీల్లో ఈ వారం ఏం వస్తున్నాయంటే?
అంకిత్, తన్వి నేగి, సుమన్ (Actor Suman), అజయ్, తనికెళ్ళ భరణి (Tanikella Bharani), సూర్య, భాస్కర్, రవి వర్మ, అయేషా, రవి శంకర్, లీల, బెనర్జీ, రవి గణేష్, రమణి చౌదరి, వంశీ, అంజలి, కిరణ్ కుమార్, ఎ.కె. శ్రీదేవి, ప్రశాంత్ సమలం, వేణుగోపాల్, తేజ, సంతోష్, వి జే లక్కీ, శ్రీను, అరుణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్ : ఎ.జె. ఆర్ట్స్ (అజయ్), కూర్పు : ఎం.ఆర్. వర్మ, పాటలు : విశ్వనాథ్ కరసాల, మాటలు : పి. మదన్, ఛాయాగ్రహణం : మోహన్ చారీ, సంగీతం : సచిన్ కమల్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : ఎస్. కిరణ్ కుమార్.