అంజలి అరోరా.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ. ‘కచ్చా బాదమ్’ అనే ఫేమస్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేసినా.. అంజలీ వీడియోకు వచ్చినంత ఆదరణ మరెవరికీ రాలేదని చెప్పుకోవచ్చు. ఈ పాటతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. సెలబ్రిటీ స్టేటస్ ను అందుకుంది. ఈ వీడియో పుణ్యమా అని బాలీవుడ్ కాంట్రవర్శియల్ బ్యూటీ కంగనా రనౌత్ నిర్వహించే లాకప్ షోలో పాల్గొనే అదృష్టాన్ని దక్కించుకుంది. ఈ షోలో పాల్గొన్న తర్వాత అంజలి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ఇవన్నీ కాసేపు పక్కన పెడితే.. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ అసభ్య వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అంజలి అరోరా లీక్డ్ ఎమ్మెమ్మెస్ పేరుతో బాగా వైరల్ అవుతోంది. ఇందులో అంజలి ముఖం క్లియర్ గా కనిపిస్తున్నది. ఓ వ్యక్తితో తను ప్రైవేటుగా గడుపుతున్నట్లు దీన్ని చూస్తే అర్థం అవుతుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది నిజమైనదే అని భావిస్తున్నారు. తాజాగా ఈ అసభ్య వీడియోపై అంజలి అరోరా స్పందించింది. నెట్టింట్లో తన పేరిట వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదని తేల్చి చెప్పింది. అదో ఫేక్ వీడియో అని అంజలి కొట్టిపారేసింది. ఈ వీడియో ఎవరు సృష్టించారో? ఎందుకు సృష్టించారో? తనకు తెలియదని చెప్పింది.
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై అంజలి కంటతడి పెట్టుకుంది. తనకు సంబంధంలేని వీడియోను తన పేరిట ప్రచారం చేయడం మనసుకు బాధను కలిగిస్తున్నట్లు వెల్లడించింది. కొందరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నది. తాను ఆ వీడియోలో లేకున్నా.. కొన్ని యూట్యూబ్ మీడియా పోర్టల్స్ పనిగట్టుకుని విష ప్రచారాన్ని చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కావాలనే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అభిప్రాయపడింది. తనకు ఓ కుటుంబం ఉందని సదరు వ్యక్తులు గుర్తుంచుకోవాని చెప్పింది. ఈ వీడియో చూసిన వారు ఎంత బాధపడతారో అర్థం చేసుకోవాలన్నది. తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారికి కూడా కుటుంబం ఉంటుందని గుర్తుంచుకోవాలన్నది. వారికి ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు బాధంటే ఏంటో అర్థం అవుతుందని అంజలి వెల్లడించింది.
సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న అసభ్య వీడియో గురించి తన తల్లిదండ్రులకు తెలుసని అంజలి తెలిపింది. అయినా వారు తనను ఎప్పుడూ ప్రశ్నించలేదని వెల్లడించింది. అందుకు కారణం.. తన పేరెంట్స్ కు తన మీద ఉన్న నమ్మకమే అని చెప్పింది. ప్రశాంతంగా కొనసాగుతున్న తన జీవితంలో కొందరు కావాలనే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆవేదన చెందింది. వాటిని తప్పకుండా ఎదుర్కొంటానని చెప్పిన అంజలి.. ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు తెలిపింది. అంజలి అరోరా లాకప్ షోలో ఉండగానే ఈ అసభ్య వీడియో లీక్ అయ్యింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అంజలీ స్పందించక తప్పలేదు.
Also Read : ఆమిర్‌పై కోపం హృతిక్ రోషన్ మీదకు - ఒక్క ట్వీట్ ఎంత పని చేసిందో చూశారా?