Animal movie machine gun cost: వయలెన్స్... వయలెంట్ యాక్షన్ సీక్వెన్సులకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అసలు సిసలైన నిర్వచనం ఇస్తారని ప్రేక్షక లోకం బలంగా నమ్ముతోంది. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'యానిమల్' టీజర్, ట్రైలర్ చూపించిన ఇంపాక్ట్ అటువంటిది. రణబీర్ కపూర్ ఖాతాలో హిందీ హిట్స్ ఉన్నాయి. అయితే... ఆయనకు యాక్షన్ ఇమేజ్ లేదు. అటువంటి హీరోని తీసుకుని భారీ యాక్షన్ సీన్స్ చేయడమే కాదు... టీజర్, ట్రైలర్ ద్వారా కన్విన్స్ చేశారు సందీప్ రెడ్డి వంగా. మరి, సినిమాలో యాక్షన్ ఎలా ఉండబోతోంది?


మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్!
'యానిమల్' ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ అనేలా వచ్చిందని యూనిట్ క్లోజ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఆ ఒక్క ఎపిసోడ్ 18 నిమిషాలు ఉంటుందని టాక్. ఈ సినిమా మొత్తం మీద యాక్షన్ సన్నివేశాల నిడివి 30 నిమిషాల కంటే ఎక్కువ ఉంటుందని తెలిసింది. 


'యానిమల్' రన్ టైమ్ మూడు గంటల 21 నిమిషాలు. అందులో అర గంటకు పైగా యాక్షన్ అంటే... మిగతా సన్నివేశాల నిడివి రెండున్నర గంటలు లేదా రెండు గంటల 45 నిమిషాలు ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య డ్రామాతో పాటు హీరో హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు సైతం ఆకట్టుకునేలా వచ్చాయని టాక్. 


ఆ మెషిన్ గన్ రేటు ఎంతో తెలుసా?
'యానిమల్' ట్రైలర్ అంతా ఒక ఎత్తు. చివరలో మెషిన్ గన్ పట్టుకుని శత్రువుల మీద రణబీర్ కపూర్ చేసిన ఫైరింగ్ మరో ఎత్తు. ఆ గన్ గ్రాఫిక్స్ కాదని, ఒరిజినల్ అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. సుమారు నాలుగు నెలల పాటు శ్రమించి దానిని రెడీ చేయించారట. కేవలం ఆ గన్ తయారీకి రూ. 50 లక్షలు ఖర్చు చేశారట. ఆ గన్ త్వరలో హైదరాబాద్ తీసుకొచ్చి కొన్ని థియేటర్లలో ప్రేక్షకుల సందర్శనార్థం ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. మరి, కుదురుతుందో? లేదో? చూడాలి.


Also Readరెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!  



రణబీర్, రష్మిక మధ్య ఫస్ట్ నైట్ సీన్!
'యానిమల్' డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఏపీ, తెలంగాణలో ఉదయం ఆరు గంటల నుంచి షోస్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఇంకా అనుమతులు రాలేదు. మల్టీప్లెక్స్ స్క్రీన్లు కొన్నిటిలో ఏడు గంటల నుంచి షోలు వేస్తున్నారు. ఆల్రెడీ అవి అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. 


Also Readయానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు


అన్నట్టు... సినిమాలో రణబీర్, రష్మిక మధ్య ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉందని బాలీవుడ్ టాక్. ఒకవైపు ఫస్ట్ నైట్... మరో వైపు విలన్స్ ఎటాక్... రెండిటినీ బాలన్స్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా తీసిన సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని టాక్. రణబీర్, రష్మిక పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ జరుగుతుండగా... విలన్స్ ఎటాక్ చేస్తారట! ఒకవైపు గాల్లోకి విలన్లను పంపిస్తూ... మరో వైపు రొమాన్స్ చేసిన సన్నివేశాలు బాగా వచ్చాయని ఇన్‌సైడ్ టాక్. సందీప్ రెడ్డి వంగా మేకింగ్ చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారట. ఇప్పటి వరకు రష్మిక ఇటువంటి సీన్ చేయలేదని ముంబై సినిమా జనాలు అంటున్నారట.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply