Revanth Reddy in Election Campaign: తెలంగాణ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) (Revanth Reddy) సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అక్టోబర్ 16న వికారాబాద్ లో నిర్వహించిన సభ నుంచి నవంబర్ 28న మాల్కాజిగిరి రోడ్ షోతో కలుపుకొని దాదాపు 87 ప్రచార సభలో పాల్లొన్నారు.
వికారాబాద్, తాండూరు, పరిగి, చేవేళ్ల, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్ రూరల్, కొడంగల్, కామారెడ్డి, గజ్వేల్, దుబ్బాక, ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, అలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జుక్కల్, ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, డోర్నకల్, ఎల్ బీ నగర్, మహేశ్వరం, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, వర్ధన్నపేట, జనగాం, పాలకుర్తి, మేడ్చల్, అంబర్ పేట, మెదక్, సంగారెడ్డి, మానకొండూరు, హుజురాబాద్, రాజేంద్రనగర్, సనత్ నగర్, సికింద్రాబాద్, నర్సాపూర్, వనపర్తి, నారాయణఖేడ్, ముషీరాబాద్, పఠాన్ చెరు, నారాయణపేట, నకిరేకల్, ఆలేరు, తుంగతుర్తి, రామగుండం, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, షాద్ నగర్, ఆర్మూర్ తదితర నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.
కేటీఆర్ (Minister KTR) ప్రచార కార్యక్రమాలు ఇలా..
గత 2 నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR) అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించారు. ఒకవైపు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తర్వాత అత్యధిక సభలు, రోడ్ షోలు, ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ (Minister KTR) మరోవైపు పార్టీ ప్రచార ప్రణాళికల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయి సమన్వయం వరకు విస్తృతంగా పని చేశారు. ఎన్నికల షెడ్యూల్ కి ముందే మంత్రి హోదాలో దాదాపు 30 నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించి గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించిన మంత్రి కేటీఆర్ (Minister KTR) , ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అటువైపు ప్రభుత్వ పనితీరు, పదేళ్ల అభివృద్ధి ప్రస్థానాన్ని సమర్థంగా వివరిస్తూనే ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
ముఖ్యంగా మహిళలు, యువత, విద్యావంతులను ఆలోచింపజేసేలా సాగిన కేటిఆర్ ప్రసంగాలు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరల్ అయ్యాయి. అలాగే అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను తన భుజాలపై మోసి.. ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం రెండు రోడ్ షోలతో పాటు ఎల్బీనగర్, శేర్లింగంపల్లి , మల్కాజ్ గిరి వంటి పెద్ద నియోజకవర్గాల్లో ఒకే రోజు నాలుగు నుంచి ఐదు రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రతి రోడ్ షోలో అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. అడుగడుగునా మంచి స్పందన కనిపించింది.