ప్రముఖ యువ తమిళ నటి అనికా విక్రమన్ తన ప్రియుడు అనూప్ పిళ్లై పై తీవ్ర ఆరోపణలు చేసింది. తన భాయ్ ఫ్రెండ్ తనపై నిరంతరం దాడి చేస్తున్నాడని ఆరోపించింది. తన పై దాడి చేశాడంటూ ఇటీవల ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పలు ఫోటోలను షేర్ చేసింది. ఈ చిత్రాలలో ఆమె మొఖం, కళ్ళు, చేతులు, ఛాతీపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోటోలతో పాటు అనూప్ పిళ్లై తనను ఎలా వేధిస్తున్నాడు అనే విషయాలను వివరిస్తూ పోస్ట్ చేసింది అనికా. ప్రస్తుతం ఈ ఫోటోలు తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


తాను గత కొన్నేళ్లుగా అనూప్ పిళ్లై అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నాని తెలిపింది అనికా. అయితే అతను తనను అప్పడప్పుడు ఇష్టారాజ్యంగా హింసిస్తున్నాడని, ప్రతి రోజూ తనను కొట్టేవాడని పేర్కొంది. గత కొన్నేళ్లుగా తాను ఈ బాధను పడుతున్నట్లు చెప్పుకొచ్చింది అనికా. గతంలో కూడా తాను అతనిపై రెండు సార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మొదట అతను చెన్నైలో తనపై దాడి చేసినపుడు తాను ఫిర్యాదు చేశానని, అయితే అప్పుడు అతను తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమింమని అడిగాడని దీంతో తాను అతన్ని క్షమించానని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ తనపై దాడి చేశాడని  అప్పుడు బెంగళూరు లో తాను పోలీస్ ష్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పింది. అయితే ఏ పోలీస్ స్టేషన్ లో తాను ఫిర్యాదు చేసింది అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. తర్వాత అతను పోలీసులకు డబ్బులు చెల్లించి ఎలాగోలా తప్పించుకున్నాడని చెప్పింది అనికా. పోలీసులు నన్ను ఏమీ చేయలేరు అనే ధైర్యంతో అతను మళ్లీ తనను కొట్టేవాడని తెలిపింది. అందుకే తాను అతన్ని విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నానని, కానీ అతను మాత్రం తనను విడిచిపెట్టడం లేదని పేర్కొంది. 


తనను శారీరకంగా హింసించడమే కాకుండా తనను మానసికంగా కూడా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. తనను షూటింగ్ లకు వెళ్లకుండా ఉండేందుకు తన మొబైల్ ను పలగలకొట్టాడని, అంతకు ముందు తనకు తెలియకుండానే తన ల్యాప్ టాప్ లో వాట్సాప్ కు కనెక్ట్ అయి చూసేవాడని తెలిపింది. అన్నిటికీ మించి ఇప్పుడు తనను, తన కుటుంబాన్నీ చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. అతని కొట్టిన గాయాలు కాస్త మెత్తపడ్డాయని, ఇప్పుడు తాను షూటింగ్స్ లలో పాల్గొటున్నానని చెప్పింది. వచ్చే వారం నుంచీ క్రమం తప్పకుండా షూటింగ్ లలో పాల్గొటానని చెప్పింది. అనికా కర్ణాటక లోని బెంగళూరు కు చెందిన అమ్మాయి. తన పాఠశాల విద్యను బెంగళూరు లోనూ కాలేజీ విద్యను చెన్నైలోనూ పూర్తి చేసింది. నటన మీద ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని తమిళ సినిమాల్లో నటించింది. ‘కె’ అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత ‘విషమకరణ్’, ‘ఎంగ పట్టన్ పార్థీయ’ మరికొన్ని సినిమాల్లో నటించింది.