Anchor Suma: తెలుగు సినిమా రంగంలో యాంకర్ సుమ గురించి తెలయని వాళ్లు ఎవరూ ఉండరు. తన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభంలో పలు టీవీ ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పంచావతారం, స్టార్ మహిళ, భలే ఛాన్సులే వంటి ప్రోగ్రాలు సుమకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. కేవలం టీవీ ప్రోగ్రాంలతో సరిపెట్టుకోకుండా సినిమా ఫంక్షన్ లకు కూడా యాంకరింగ్ చేస్తూ పాపులర్ అయింది. ఏ ప్రోగ్రాం అయినా యాంకర్ గా సుమ అయితేనే బాగుంటుందని అందరూ అనుకునేంతగా సుమ తనను తాను తీర్చిదిద్దుకుంది. అవ్వడానికి మళయాళీ అమ్మాయి అయినా తెలుగు వారి ఇంటి కోడలుగా వచ్చి తెలుగు భాష మీద పట్టు పెంచుకుంది. ఎక్కడైనా తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టిపడేస్తుంది సుమ. తెలుగు కూడా అంతే చక్కగా మాట్లాడుతుంది. అయితే ప్రస్తుతం యాంకర్ సుమకు సంబంధించి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సుమను అరెస్టు చేసి తీసుకెళ్తున్నట్టుగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో సుమ అభిమానులు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు. 


ప్రస్తుతం సుమ ఇటు టీవీ ప్రోగ్రాంలకు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తుంది. అంతే కాదు ఈ మధ్య ఎక్కువగా సినిమా రిలీజ్ లకు ముందు ఆ మూవీ టీమ్ లతో ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. అలా ఈ మధ్య కాలంలో చాలా ఇంటర్య్వూలు చేసింది సుమ. అయితే తాజాగా సుమ కు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో యాంకర్ సుమ చేతికి సంకెళ్లు ఉన్నట్లు కనిపిస్తోంది. కారు లోపల డోర్ కు సుమ చేతులు సెంకెళ్లతో లాక్ చేసి ఉన్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సుమను ఎందుకు అరెస్ట్ చేశారు. అసలు ఏమైంది అంటూ ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఇదంతా ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగం అని తెలుస్తోంది. 






యాంకర్ సుమ ఇటీవల ఓ హీరోతో ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్య్వూ మరెవరో కాదు అల్లరి నరేష్. ఆయన ఇటీవల నటించిన సినిమా ‘ఉగ్రం’. అల్లరి నరేష్ గత కొన్ని సినిమాల నుండి తన స్టైల్ ను పూర్తిగా మార్చేశారు. కామెడీ సినిమాలే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ‘నాంది’, ‘ఇట్లు మారేడుపల్లి నియోజకవర్గం’ వంటి సినిమాలు చేశారు. ఇప్పుడు ‘ఉగ్రం’ తో మరోసారి కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నరేష్. ‘నాంది’ సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అందరి హీరోలు లాగానే నరేష్ కూడా ముందునుంచే సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే  యాంకర్ సుమ నరేష్ ను ఇంటర్వ్యూ చేసింది. అయితే సుమ సంకెళ్లతో ఉన్న ఫోటో ఈ ఇంటర్వ్యూ కు సంబంధించినదే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు దీనిపై ఫన్నీ మేమ్స్ ను కూడా క్రియేట్ చేసి షేర్ చేస్తున్నారు. ఇప్పుడా మేమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఉగ్రం సినిమా మే 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్స్. ఇక నాగ చైతన్య నటించిన ‘కస్టడీ’ సినిమా కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా మే 12 న సినిమాను విడుదల చేయనున్నారు. 



Read Also: ఓటీటీలో విడుదలకు ‘కబ్జా’ రెడీ- ఎప్పుడు, ఎక్కడో తెలుసా?