టాలీవుడ్ స్టార్ యాంకర్స్ లో ఒకరైన అనసూయ ఈ మధ్యకాలంలో వరుస సినిమా ఆఫర్లు అందుకుంటుంది. దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించింది అనసూయ. చిరంజీవి పోషించిన బ్రహ్మ పాత్రను జైలుకి పంపించే పాత్రలో అనసూయ నటించింది. అయితే ఆమె ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. తన పాత్రకు మాత్రం అనసూయ పూర్తి న్యాయం చేసింది. 


దీంతో ఓ నెటిజన్ 'గాడ్ ఫాదర్ సినిమాలో మీ రోల్ చాలా నచ్చింది. సినిమాలో ఇంత మంది రోల్ చేసినప్పటికీ మీరెందుకు ప్రచార కార్యక్రమాల్లో కనిపించడం లేదు?' అని ట్వీట్ చేశారు. ఇది చూసిన అనసూయ.. 'మీరు నమ్మాలి.. చాలా షూట్స్ ఒకేసారి జరుగుతున్నాయి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. వరుస షూటింగ్స్ తో ఆమె బిజీగా ఉండడం వలన ప్రచారాల్లో పాల్గొనలేదని తెలుస్తోంది. 


అయితే ఆమె ఇచ్చిన రియాక్షన్ పై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 'షూట్స్ ఒకే కానీ.. సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేనంత బిజీనా..?' అంటూ ప్రశ్నిస్తున్నారు. 'ప్రమోషన్స్ లో మీరు కనిపిస్తే సినిమా ఎవరూ చూడరని సైడ్ చేసి ఉంటారని' ట్రోల్ చేస్తున్నారు. అనసూయపై ఇలాంటి ట్రోల్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు వీటికి ధీటుగా సమాధానం కూడా చెబుతుంటుంది. 


ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో అనసూయ గురించి ప్రస్తావించలేదని.. ఆమె తనపై అలిగింది చిరంజీవి చమత్కరించిన సంగతి తెలిసిందే. ఇక 'గాడ్ ఫాదర్' సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వస్తోంది. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా ఇది తెరకెక్కింది. ఇందులో నయనతార, సత్యదేవ్ లు కీలకపాత్రలు పోషించారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ లో కనిపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. 


అనసూయపై బ్రహ్మాజీ పంచ్:


మొన్నామధ్య అనసూయని ట్విట్టర్ లో కొందరు నెటిజన్లు ఆంటీ అని పిలిచినందుకు ఆమె కేసు వేస్తానని చెప్పడం హాట్ టాపిక్ అయింది. దీనిపై చాలా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. ఒకరోజు మొత్తం ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఆంటీ అని పిలిస్తే వేధించినట్లేనని అనసూయ చెప్పడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి ట్వీట్లు వేశారు. అయితే నటుడు బ్రహ్మాజీ ఈ టాపిక్ పై పరోక్షంగా ఓ జోక్ చేశారు. 


ట్విట్టర్ లో ఆయన ఒక ఫొటోని షేర్ చేసి.. 'ఏం జరుగుతోంది..?' అని ట్వీట్ వేశారు. దానికి ఓ నెటిజన్ 'ఏం లేదు అంకుల్' అని బదులిచ్చాడు. అది చూసిన బ్రహ్మాజీ 'అంకుల్ ఏంట్రా అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగా..?' అంటూ ఫన్నీ ఎమోజీతో రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మరింత ఫన్నీగా కామెంట్స్ చేశారు. 


Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?


Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది