Anasuya Bharadwaj: రష్మీ గొడవలోకి అనసూయ, పచ్చి బూతులతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

అందాల నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అనవసర వివాదంలోకి తనను లాగడం పట్ల చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది.

Continues below advertisement

సోషల్ మీడియాలో అందాల భామ అనసూయ బాగా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలతో పాటు తన వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటుంది. గత కొద్దికాలంగా తను బికినీ షోలతో అభిమానులను అలరిస్తోంది. అదే సమయంలో  సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఢీ అంటే ఢీ అన్నది. ఇప్పుడిప్పుడే ఆ వివాదం కాస్త చల్లబడింది. ఇంతలో మరోసారి బూతులతో రెచ్చిపోయింది. అనవసర వివాదంలోకి తనను లాగిన నెటిజన్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

Continues below advertisement

అనవరసర వివాదంలోకి అనసూయను లాగిన నెటిజన్

 వాస్తవానికి యాంకర్ రష్మి గౌతమ్ రీసెంట్‌గా హిందూ మతం గురించి చేసిన కామెంట్స్‌ పై సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తోంది.  అన్ని మతాలలో ఉన్న కుల వివక్ష గురించి రష్మి చర్చకు తెర తీసింది.  హిందూ మతంతో పాటు అన్ని మతాలలో కుల విభజన ఉందని చెప్పింది. హిందూ మతంలో వెనుకబడిన సామజిక వర్గాలపై వివక్ష చూపుతుంటారని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఆయన ప్రశ్నికు రష్మి సమాధానం చెప్పింది.  చాలా మంది హిందూ మతం నుంచి వేరే మతాలకు మారుతుంటారు. కానీ, వారు హిందూ సంప్రదాయాలనే ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు వేరే మతాల సర్టిఫికేట్  ఎందుకు వాడుకుంటున్నట్లో? అని క్వశ్చన్ వేసింది. ఈ చర్చ కొనసాగుతున్న సందర్భంలో,  రష్మి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే, ఈ ట్వీట్ లో అనసూయను విమర్శించాడు.   

చెంప చెల్లుమనిపించేలా రిప్లై ఇచ్చిన అనసూయ

అనవసర వివాదాంలోకి తనను లాగడం పట్ల అనసూయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరుష పదాలతో అతడికి చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పింది. బూతులతో సదరు వ్యక్తిపై విరుచుకుపడింది. 'హలో.. మిమ్మల్ని సరిచేయనీయండి. నాకు 'బాల్స్' లేవు. కానీ, అవగాహన ఉన్న అంశాలపై ధైర్యంగా మాట్లాడేందుకు 'వజైనా' ఉంది. మనంతరం ఎదరికి తగినట్లుగా వాళ్లు మాట్లాడుతాం. కొన్ని అంశాలపై ఎవరి అంచనాలకు అనుగుణంగా వాళ్లం ప్రవర్తిస్తాం. ఎలాంటి విషయాలపై మాట్లాడాలి అనేది వారి వారి వ్యక్తిగత అంశం.  మీరు మాట్లాడే అంశాలపై అందరూ స్పందించాలని అనుకోవడం కరెక్ట్ కాదు అంకుల్” అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది.

అనసూయ రిప్లైకి అందరూ షాక్!

అనసూయ ఇచ్చిన సమాధానంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు తను చాలా సార్లు కౌంటర్లు ఇచ్చినా, ఇంతలా ఎప్పుడూ పరుష పదజాలం ఉపయోగించలేదంటున్నారు. అయినా, సంబంధంలేని విషయంలోకి తనను లాగితే ఇలానే ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. గతంలో ‘ఆంటీ’ వివాదం, కొద్ది రోజుల క్రితం విజయ్ ఫ్యాన్స్ లొల్లి, అన్నీ ఈకోవకు చెందినవే కావడం విశేషం. ప్రస్తుతం అనసూయ ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. తొలి భాగంలో అనసూయ దాక్షాయణి పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. రెండో భాగంలో ఈమె పాత్ర మరింత అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె నటించిన ‘విమానం’ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇందులో వేశ్య పాత్రలో అనసూయ అలరించింది.

Read Also: ఇట్స్ అఫీషియల్ - బన్నీతో త్రివిక్రమ్ నాలుగో మూవీ, హీరోయిన్ ఆమేనా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement