ముంబైలో 26/11 దాడులు భారతజాతి ఎప్పటికీ మర్చిపోదు. ఆ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అతని జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమా ‘మేజర్’. ఈ సినిమా సందీప్ వ్యక్తిగత జీవితన్ని కూడా అందంగా చూపించారు. ఈ సినిమాలో సందీప్ గా అడివి శేష్ నటించారు. ఇక సినిమాను నిర్మించింది మహేష్ బాబు. ఈ సినిమా గురించి బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ ట్వీట్ చేశారు. ‘ముంబై 26/11 దాడుల వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథే మేజర్ మూవీ. ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో ఉంది. మై బెస్ట్ విషెస్’ అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసి మేజర్ టీమ్ మొత్తం చాలా హ్యాపీగా ఫీలైంది. 


నిర్మాత మహేష్ బాబు ఆ ట్వీట్ ఆనందంగా రిప్లయ్ ఇచ్చారు... ‘మీ ఎంకరేజ్ మెంట్ ధన్యవాదాలు ’ అని రీట్వీట్ చేశారు. అలాగే అడివి శేష్ కూడా స్పందించారు. ‘ఇది చాలా గొప్ప సంగతి, లెజెండే తనకు తానుగా స్పందించారు’ అని అన్నారు. మేజర్ టీమ్ కు అమితాబ్ ట్వీట్ చాలా ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. మేజర్ సినిమా తెలుగుతో పాటూ తమిళం, హిందీలలో కూడా విడుదలై మంచి కలెక్షన్లను సాధిస్తోంది. సినిమాకు విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్ వచ్చింది. 


ఈ సినిమాలో మేజర్ సందీప్ భార్యగా సయీ మంజ్రేకర్ నటించింది. ఇక ప్రకాష్ రాజ్, రేవతి తల్లిదండ్రులుగా కనిపించారు. శోభిత ధూళిపాళ మరో కీలక పాత్రలో కనిపించింది. జూన్ 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సాధించింది. 









Also read: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో విక్రమ్ టీమ్, సల్మాన్ ఖాన్ కూడా


Also Readపెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్