స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇతర భాషల్లో సినిమాను ప్రమోట్ చేసుకునే టైం చిత్రబృందానికి దొరకలేదు. ఇప్పటివరకు ఆన్ లైన్ ప్రమోషన్స్ మాత్రమే చేస్తూ వచ్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో బన్నీ వివిధ ప్రాంతాలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈరోజు చెన్నైకి వెళ్లారు.
అక్కడ ప్రెస్ మీట్ ను నిర్వహించగా.. బన్నీ తన స్పీచ్ తో అక్కడి వారిని ఆకట్టుకున్నాడు. పూర్తిగా తమిళంలో మాట్లాడుతూ కనిపించాడు. నిజానికి బన్నీ తన యంగేజ్ వరకు కూడా తమిళనాడులోనే పెరిగాడు. కాబట్టి అతడికి తమిళంలో మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ అక్కడి మీడియా వారు మాత్రం బన్నీ తమిళ ఫ్లుయెన్సీకి ఆశ్చర్యపోయారు. ఇక బన్నీ తన మూలాలు తమిళనాడులోనే ఉన్నాయని చెబుతూ.. తాను తమిళుడినని చెప్పడం విశేషం.
తాను పుట్టింది మద్రాస్ లో అని.. ఇరవై ఏళ్ల వయసు వచ్చేవరకు ఇక్కడే ఉన్నానని చెప్పాడు. స్కూల్ లో తనతో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్, చదువు చెప్పిన టీచర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారని.. ఇక్కడ తన సినిమా బాగా ఆడితే చూడాలనేది తన కల అని బన్నీ చెప్పుకొచ్చాడు. తన సినిమాలు హిందీలో అనువాదమై చాలా బాగా ఆడాయని.. నార్త్ లో ఎంత ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ.. తాను పుట్టిపెరిగిన తమిళనాడులో తన సినిమా బాగా ఆడాలనేది తన కోరిక అని చెప్పాడు.
ఏదొక సినిమా అని కాకుండా.. కోలీవుడ్ లో సరైన సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని ఇంతకాలం ఆడానని.. 'పుష్ప' సినిమా కచ్చితంగా ఇక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చాడు బన్నీ. నాలుగు సినిమాలకు పడే కష్టం ఈ ఒక్క సినిమాకి పడ్డామని.. తిరుపతిలో ఎర్రచంద్రనం చుట్టూ తిరిగే కథ కావడంతో కోలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని.. ఈ సినిమా ఇక్కడ పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాడు బన్నీ.
Also Read:'పుష్ప' ఐటెం సాంగ్.. సమంత ఎంత తీసుకుందంటే..
Also Read: గ్రాండ్ ఫినాలేలో బాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే..?
Also Read: హీరో ఉన్నాడు 'బిగ్ బాస్'లో... అతడి సినిమా డబ్బింగ్ అవుతోంది హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి