యంగ్ హీరో రామ్ చివరిగా 'ది వారియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రామ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. హీరోగా రామ్ 20వ చిత్రమిది (RAPO20). ఇందులో రామ్ కి జంటగా యంగ్ సెన్సేషన్, కొత్త హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథను ముందుగా బన్నీకి వినిపించారట దర్శకుడు బోయపాటి.
ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. 'ది వారియర్' తర్వాత రామ్ పోతినేనితో ఆయన నిర్మిస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథను ముందుగా బన్నీకి వినిపించారట దర్శకుడు బోయపాటి.
అల్లు అర్జున్ తో సినిమా చేయాలనుకున్న బోయపాటి ఈ కథనే వినిపించారట. కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఆ తరువాత 'సరైనోడు' కథ చెప్పారట. బన్నీకి 'సరైనోడు' నచ్చడంతో దానికే ఓటేశారు. దీంతో బోయపాటి మొదట రాసుకున్న కథ అలా పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు అదే కథను రామ్ కి చెప్పి మెప్పించినట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఇలా ఒక హీరో కోసం అనుకున్న కథతో మరో హీరో సినిమా చేయడం కామన్. ఇప్పుడు బన్నీ కోసం అనుకున్న కథతో రామ్ సినిమా చేస్తున్నారంతే. అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ:
ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశి రౌతేలా. ఇప్పటికే ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అలానే ఐటెం సాంగ్స్ లో కూడా కనిపించింది. ఇప్పుడు తెలుగు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో 'బ్లాక్ రోజ్' అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు బోయపాటి-రామ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. రామ్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి.
సంగీత దర్శకుడిగా తమన్:
ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ (S Thaman) సంగీతం అందించనున్నారు. 'అఖండ' చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆ విజయం తర్వాత మరోసారి తమన్, బోయపాటి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రామ్ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయగా... మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి. హిందీలో డబ్బింగ్ అయ్యాయి. ఉత్తరాది ప్రేక్షకుల్లో ఆయన సినిమాలకు డిమాండ్ ఉంది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో సినిమా అంటే కచ్చితంగా నార్త్‌లో డిమాండ్ ఉంటుందని చెప్పొచ్చు. ఊర మాస్ కమర్షియల్ చిత్రాలు తీయడంలో, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి చిత్రాలు తెరకెక్కించడంలో తన శైలి ఏంటనేది బోయపాటి శ్రీను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని టాక్.
Also Read : 'లైగర్' గాయాలు - ఎనిమిది నెలల తర్వాత