యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్' సినిమాకి కొనసాగింపుగా ఇటీవల కేజీఎఫ్ చాఫ్టర్ 2 విడుదలైంది. ఈ రెండు సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా 'కేజీఎఫ్2' సినిమా అంచనాలకు మించి ఆడియన్స్ ను అలరించింది. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించింది. చాలా ఏరియాల్లో థియేటర్లు ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి.
ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న 'కేజీఎఫ్2' యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 'కేజీఎఫ్2' యూనిట్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. స్వాగ్, ఇంటెన్సిటీతో యష్ నటించాడని అన్నారు. రవి బస్రూర్ సంగీతం, భువన గౌడ సినిమాటోగ్రఫీ సినిమాకి ఎస్సెట్స్ అని.. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టిలతో పాటు సినిమా యూనిట్ అంతటికీ కంగ్రాట్స్ చెప్పారు అల్లు అర్జున్.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ను కొనియాడుతూ.. అద్భుతమైన సినిమా అందించారని.. మీరు ఏదైతే కలగన్నారో దాన్ని నిజం చేసి చూపించారని పేర్కొన్నారు. ఇంత మంది అనుభవాన్నిచ్చినందుకు, భారతీయ సినిమా ఖ్యాతిని పెంపొందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లు అర్జున్ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యష్ ఫ్యాన్స్ తో పాటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు. ఒకరిద్దరు మినహా టాలీవుడ్ హీరోలెవరూ కూడా కేజీఎఫ్2 సినిమాపై స్పందించలేదు. కానీ ఎన్టీఆర్, మహేష్ బాబు తనకు ఫోన్ చేసి ప్రశంసించారని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు.
Also Read: హీరో కార్తికేయ కొత్త సినిమాలో సిరివెన్నెల ఆఖరి పాట - షూటింగ్ షురూ
Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?