Gujrat Drugs: గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం! విలువ ఏకంగా రూ.2 వేల కోట్లు

Gujrat Drugs Case: గాంధీధామ్‌లోని ఒక కంపెనీ ప్రాంగణంలో సుమారు 2 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్‌ను కంటైనర్లలో దాచి ఉంచారు.

Continues below advertisement

గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ (DRI) బృందం సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో ఏకంగా రూ.2 వేల కోట్ల విలువ గల మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. గాంధీధామ్‌లోని ఒక కంపెనీ ప్రాంగణంలో సుమారు 2 వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్‌ను కంటైనర్లలో దాచి ఉంచారు. ప్రస్తుతం డీఆర్‌ఐ, ఏటీఎస్‌ అధికారులు ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించిన విచారణలో నిమగ్నమై ఉన్నారు.

Continues below advertisement

స్థానిక వార్తా పత్రికలు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెవెన్యూ విభాగాలు గాంధీ ధామ్‌లోని కాండ్లా పోర్ట్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాంగణంలో సంయుక్తంగా దాడి చేశాయి. అక్కడ ఉంచిన కంటైనర్లలో పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను దాచినట్లుగా గుర్తించారు. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌడర్‌ రూపంలో ఉన్న ఈ హెరాయిన్‌ ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. ఓ కంటైనర్‌లో దాదాపు 300 కిలోల డ్రగ్స్ ఉన్నాయని, దీని ఖరీదు రూ.2 వేల కోట్ల రూపాయలని చెబుతున్నారు. ప్రస్తుతం తదుపరి విచారణను కొనసాగిస్తున్నాయి.

Continues below advertisement