మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అనుబంధం, సంబంధం గురించి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులకు కూడా తెలుసు. అరవింద్‌కు చిరంజీవి బావ. బంధుత్వం కంటే ముందు ఇద్దరూ మంచి మిత్రులు. అయితే... ఇటీవల కొణిదెల కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య దూరం పెరిగిందని, మరొకటని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. అరవింద్ దగ్గర ఆ విషయం ప్రస్తావించారు ఆలీ. ఆ తర్వాత ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... 


కాంట్రవర్సీ లేదన్నారు...
ఇదేంటి? స‌ర్‌ప్రైజా??
ప్రముఖ హాస్య నటుడు ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga). ఈ నెల 10వ తేదీన టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ కోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను తీసుకు వచ్చారు. లేటెస్టుగా ఆ ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. అల్లు అరవింద్, ఆలీ మధ్య సంభాషణ మొదట సరదాగా సాగింది.


ప్రోమో చివర్లో ''అరవింద్ గారి ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ వచ్చింది?'' అని ఆలీ అడిగారు. అప్పుడు అల్లు అరవింద్ ''మీరు కొన్ని కాంట్రవర్సీలు ఏవైనా అడుగుతానంటే అవి ముందు చెప్పమని అన్నాను. అబ్బే.... అవేవీ లేవండీ! స‌ర్‌ప్రైజింగ్‌ క్వశ్చన్స్ ఉన్నాయన్నారు. స‌ర్‌ప్రైజింగ్‌ క్వశ్చన్స్‌లో ఇదొకటా?'' అని ఎదురు ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన సమాధానం ఇచ్చినట్లు ఉన్నారు. చిరంజీవి ఫ్యామిలీతో విబేధాలు అని వస్తున్న వార్తలపై అల్లు అరవింద్ ఏం చెప్పారో తెలియాలంటే... ఈ నెల 10 వరకు వెయిట్ చేయాలి. 


అర్హ ఎంత తెలివైనదంటే...
'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో గ్రాండ్ చిల్డ్రన్, అల్లు అర్జున్ సంతానం గురించి కూడా అల్లు అరవింద్ మాట్లాడారు. ''మీరు మీడియాలో వాళ్ళను (అల్లు అయాన్, అల్లు అర్హ) చూస్తూ ఉంటారు. అర్హ మాత్రం బాబోయ్... ఎంత తెలివైనదంటే? అంత చిన్న వయసులో అంత తెలివైన వాళ్ళను చూడటం అరుదు. నా మనవరాలు కనుక ఎక్కువ చెప్పకూడదు. వద్దులే'' అని ఆయన తెలిపారు (Allu Aravind On Allu Arha).



Also Read : 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?







అల్లు అరవింద్ ఎందుకు నటన వైపు వెళ్ళలేదు?
నటుడిగా తెలుగు తెరపై అల్లు రామలింగయ్య తనదైన ముద్ర వేశారు. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్ అయ్యారు. ఎందుకు నటన వైపు వెళ్ళలేదు? అని ఆలీ ప్రశ్నిస్తే... ''మా నాన్న గారికి, నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది. 'నువ్వు యాక్టర్ అయితే డబ్బు రిస్కులు అవీ ఉండవు కదా. ఆలోచించు' అన్నారాయన. నేను ఎప్పుడూ ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను కానీ ఉద్యోగి అవ్వాలనుకోలేదని చెప్పాను'' అని తెలిపారు. 


అల్లు రామలింగయ్య కుమారుడిగా తాను 22 సినిమాల్లో నటించానని ఆలీ చెప్పగా... ''ఆలీ ఆస్తిలో వాటా అడగటం లేదుగా'' అని అల్లు అరవింద్ చమత్కరించారు. అంతే కాదు... 'రాత్రి ఇంటికి వెళతారు కదా?' అని ఆలీ వేసిన మరో ప్రశ్నకు ''ఆలీ గారూ... అందులో చిన్న కొంటె ప్రశ్న ఉంది'' అని కరెక్ట్ చేశారు. తన సతీమణి నిర్మల తనను ఎక్కువ ప్రశ్నించదని, విసిగించదని ఆయన తెలిపారు. 


Also Read : 'స్వాతి ముత్యం' రివ్యూ : మండపంలో పెళ్లి ఆగితే అంత వినోదమా? బెల్లంకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే?