Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?

Allu Arjun: రావు రమేష్ హీరోగా నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.

Continues below advertisement

Allu Arjun Speech in Maruti Nagar Subramanyam Pre Release Event: ‘పుష్ప 2’ సినిమా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుందని అల్లు అర్జున్ నొక్కి మరీ చెప్పారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ఆయన ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుష్ చేసే ‘పుష్ఫ 2’ అప్‌డేట్ కూడా చెప్పారు. తన లైఫ్‌లోనే అత్యంత కష్టపడ్డ క్లైమ్యాక్స్ ‘పుష్ప 2’ అని అల్లు అర్జున్ అన్నారు. ఇంత కష్టం ఏ సినిమాకీ పడలేదని తెలిపారు.

Continues below advertisement

సాధారణంగా తన సినిమాల గురించి మాట్లాడాలంటే భయపడతానని, కానీ ఈ సినిమా గురించి ఎటువంటి భయం లేకుండా మాట్లాడతానని అన్నారు. దీంతో ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం అన్నది ఫిక్స్ అయిపోయింది. అదే రోజున బాలీవుడ్‌లో విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘చావా’ కూడా విడుదల కానుంది.

Continues below advertisement