ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల 'పుష్ప ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకి తెగ కనెక్ట్ అయిపోయారు. సామాన్యులతో పటు సెలబ్రిటీలను కూడా ఈ సినిమా అలరించింది. అందరూ ఈ సినిమాలో హీరో డైలాగ్స్ ను, డాన్స్ లను ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేశారు. గ్లోబల్ వైడ్ గా 'పుష్ప' చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' అనే సినిమా తెరకెక్కనుంది. 


ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల్లో సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం బన్నీ తన లుక్ ను మార్చకుండా అలానే కంటిన్యూ చేస్తున్నారు. సినిమా షూటింగ్ కి ఇంకాస్త సమయం ఉండడంతో బన్నీ తన ఫ్యామిలీను తీసుకొని వెకేషన్ కి చెక్కేశారు. భార్యా స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆఫ్రికాలోని టాంజానియా అనే ప్రాంతానికి వెళ్లారు. 


అక్కడ ఫేమస్ పార్క్ లో బన్నీ అండ్ ఫ్యామిలీ ఓ ఫొటో దిగారు. దీన్ని స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇక 'పుష్ప ది రూల్' సినిమా విషయానికొస్తే ఫస్ట్ పార్ట్ ఇక్కడితో ఎండ్ చేశారో అక్కడ నుంచే స్టోరీ కంటిన్యూ కానుంది. పార్ట్ 2లో  పుష్ప‌రాజ్‌, భైరాంసింగ్ షెకావ‌త్ మధ్య గొడవలను చూపించబోతున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ ఈ సినిమా నిర్మిస్తోంది. 


Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?


Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్