సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన అక్కినేని అఖిల్ కు ఇప్పటి వరకు ఒక్క సరైన హిట్ పడలేదు. ఓవైపు అన్న నాగ చైతన్య కాస్త ఫర్వాలేదు అనిపించినా, అఖిల్ పరిస్థితే వరెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` కాస్త ఫర్వాలేదు అనిపించింది. అంతకు ముందు విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం పొందాయి. ఎలాగైనా మాస్ హీరోగా గుర్తింపు పొందాలని భావిస్తున్న ఈ అక్కినేని యంగ్ హీరో, తాజాగా ‘ఏజెంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


ప్రపంచ వ్యాప్తంగా ‘ఏజెంట్’ విడుదల


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్‌గా  ‘ఏజెంట్’ మూవీ తెరకెక్కింది. మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టి కీలక పాత్రలో పోషించగా, సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఇవాళ ఈ చిత్రం విడుదల అయ్యింది. ఓవర్సీస్‌లో ఇప్పటికే ఈ సినిమాను చూసేశారు ప్రేక్షకులు. అక్కడి సినీ లవర్స్ ఈ సినిమా గురించి ఏం అంటున్నారు. అఖిల్ ‘ఏజెంట్’ హిట్టా? ఫట్టా? అనే విషయాన్ని ట్విట్టర్ రివ్యూలో చూద్దాం..   


RAW ఏజెన్సీ కీలక ఆపరేషన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. రా అధికారి మమ్ముట్టి ఓ మాఫియా ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్ అవుతారు. వాళ్లను పట్టుకోవడం కోసం అఖిల్ అయితే బాగుంటుందనే నిర్ణయానికి వస్తారు. చిరవకు ఆ మాఫియా ముఠాను పట్టుకునే బాధ్యత అఖిల్ టీమ్ కు అప్పగిస్తారు. అఖిల్ వారిని ఎలా పట్టుకున్నాడు? ఈ ఆపరేషన్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో మూవీ తెరకెక్కించారు.


‘ఏజెంట్’పై ఓవర్సీస్ ఆడియెన్స్ టాక్ ఏంటి?   


‘ఏజెంట్’ సినిమా గురించి ఓవర్సీస్ ఆడియెన్స్ ట్విట్టర్ లో రివ్యూలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అభిప్రాయాల ప్రకారం.. చాలా వరకు నెగెటివ్ టాక్ వచ్చింది. అఖిల్ ఖాతాలో మరో డిజాస్టర్ పడిందంటున్నారు. అయ్యగారు ఏంటిది మాకు? అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్లు తప్ప చూడ్డానికి ఏదీ బాగాలేదని చెప్తున్నారు. అఖిల్ యాక్షన్ సీన్లలో మెప్పించినా, నటనలో మాత్రం తేలిపోయాడంటున్నారు. ఫస్టాఫ్ కాస్త బాగానే ఉన్నా, సెకండ్ ఆఫ్ భరించలేం అంటున్నారు. స్టోరీ, స్లో నేరేషన్, క్వాలిటీ లేని వీఎఫ్ఎక్స్, సిల్లీ క్లైమాక్స్, ఆకట్టుకోని పాటలు, వరెస్ట్ బీజీఎం అంటూ పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కనీసం హీరోయిన్ లిప్ సింక్ కూడా లేదంటున్నారు. కామెడీ కూడా సరిగా పండలేదంటున్నారు. సినిమాలో ఉన్నట్విస్టులు పర్వాలేదని అంటున్నారు. కొందరు ఫస్ట్ ఆఫ్, యాక్షన్ సీన్స్ బాగున్నాయని, యాక్షన్ సీన్స్‌లో అఖిల్ అదరగొట్టాడని, అయ్యగారికి హిట్ దక్కినట్లేనని కామెంట్లు చేస్తున్నారు. అయితే, అసలైన రివ్యూలు వస్తేగానీ.. ఈ మూవీ హిట్టా, ఫట్టా అనేది చెప్పలేం.


















‘ఏజెంట్’ ఆపరేషన్ మిస్ ఫైర్


మొత్తంగా అఖిల్ ‘ఏజెంట్’ పైకి చూడ్డానికి బాగానే ఉన్నా, కథలో సత్తా లేదంటున్నారు. సినిమాలో అసలు సోల్ అనేది లేదంటున్నారు. మమ్ముట్టి నటన అద్భుతంగా ఉన్నా, అఖిల్ మాత్రం నటనలో ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాడంటున్నారు. ఈ సినిమాతో గట్టి హిట్ కొట్టాలనుకున్న అఖిల్ కల, కలగానే మిగిలిందంటున్నారు. ఓవరాల్ గా పూర్తి నెగెటివ్ టాక్ తో ‘ఏజెంట్’ ఆపరేషన్ మిస్ ఫైర్ అయ్యిందంటున్నారు.


Read Also: హ్యాపీ బర్త్ డే సామ్ - సమంత అసలు పేరే ఆ సినిమాకు టైటిల్, మూవీస్‌లోకి రాకముందు ఆమె జాబ్ ఇదే!