డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమా కోసం క‌థ‌, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాతో పూరి శిష్యుడు అనిల్ పాడూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. కేతిక శర్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 29న విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. రిలీజ్ కు ముందు ఈ సినిమా హడావిడి మాములుగా చేయలేదు. ఆకాష్ పూరి, కేతిక శర్మల రొమాంటిక్ పోస్టర్లతో రచ్చ చేశారు. 


Also Read: బిజీ డిసెంబర్... అసలు గ్యాప్ లేదుగా..


ట్రైలర్, టీజర్స్ కి యూత్ బాగా కనెక్ట్ అయింది. ఇక ప్రమోషన్స్ కి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లను, హీరోలను తీసుకొచ్చారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. రిలీజ్ కి ముందు ఈ సినిమా చేసిన హంగామాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. కానీ ఓ వర్గం ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే కథ కావడంతో సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. లాంగ్ రన్ లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేకపోయింది. 


ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కి చెందిన 'ఆహా' ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి డిజిటల్ లో ఈ సినిమాకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి!