1 మే 1971న సికింద్రాబాద్‌లో జన్మించిన అజిత్ అసలు పేరు అజిత్ కుమార్ సుబ్రమణ్యం. తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా సత్తా చాటుతున్నారు. రజనీ కాంత్ తర్వాత అతిపెద్ద సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి పలు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. అజిత్ కేవలం సినిమా హీరో కాదు. ప్రొఫెషనల్ మోటర్ కార్ రేసర్. MRF రేసింగ్ సిరీస్ (2010)లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మైదానంలో, ఫార్ములా ఛాంపియన్‌షిప్ రేసులో పాల్గొన్న అతి కొద్ది మంది భారతీయులలో అజిత్ ఒకరు. జర్మనీ, మలేషియాలో జరిగిన పలు రకాల రేసుల్లోనూ ఆయన పాల్గొన్నారు. అజిత్ తన వార్షిక సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. అజిత్ లైఫ్ స్టైల్, ఆస్తులు సహా పలు ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నికర ఆస్తుల విలువ
అజిత్ నికర ఆస్తుల విలువ రూ. 350 కోట్లు. ఇవన్నీ తను నటుడిగా సినిమాలు, ఎండార్స్ మెంట్స్ ద్వారానే సంపాదించారు.
కార్ కలెక్షన్
అజిత్ గ్యారేజీ పలు రకాల లగ్జరీ కార్లతో నిండి ఉంది. లంబోర్ఘిని, BMW 7-సిరీస్ 740 Li లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అప్రిలియా కాపోనార్డ్, BMW S1000 RR, BMW K1300 S లాంటి ఖరీదైన బైక్‌లు ఉన్నాయి. అతడి కొత్త లంబోర్ఘిని కారు ధర దాదాపు రూ. 34 కోట్లు. బైక్‌ల ధర ఒక్కోదానికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు ఉంటుంది.
రెమ్యునరేషన్
అజిత్ కొంత కాలం క్రితం వరకు ఒక్కో సినిమాకు రూ. కోటి తీసుకునే వాడు. ఆ తర్వాత ఒక్కో సినిమాకు 35 నుంచి 40 కోట్లు అందుకున్నాడు. తాజాగా ‘తునివు’కు రూ. 48 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటులలో ఆయన ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక అజిత్ వార్షిక ఆదాయం రూ. 100 కోట్లుగా కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
వ్యక్తిగత జీవితం
అజిత్ ‘అమర్కలం’ సినిమాలో తనతో కలిసి హీరోయిన్ గా నటించిన షాలినిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఏప్రిల్ 2000లో జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
కెరీర్
‘ఎన్ వీడు ఎన్ కనవర్’ సినిమాతో 1990లో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో తను పాఠశాల విద్యార్థిగా కనిపించారు. 1993లో తెలుగు చిత్రం ‘ప్రేమ పుస్తకం’లో నటించారు. ఇప్పటి వరకు అతడి ఏకైక తెలుగు చిత్రం ఇదే. అజిత్ హీరోగా చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ లోనూ కనిపించారు. 1995లో విడుదలైన ‘ఆసై’ చిత్రం ద్వారా మంచి హిట్ అందుకున్నారు. ‘కాదల్ కొట్టాయ్’ సినిమాతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమాలో నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత అజిత్ స్టార్ హీరోగా కొనసాగారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తమిళ టాప్ స్టార్లలో ఒకరిగి కొనసాగుతున్నారు.
Read Also: ‘సీతారామం’ బ్యూటీపై దారణ ట్రోలింగ్, నేనూ మనిషినే అంటూ ఆవేదన!