నటి మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో పాన్ ఇండియా రేంజిలో పాపులారిటీ సంపాదించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఉత్తరాది ముద్దుగుమ్మ అయినా, అచ్చం తెలుగమ్మాయిలా  ఆకట్టుకుంది. ఎలాంటి గ్లామర్ షో లేకుండానే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మను నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.  


మృణాల్ పై దారుణంగా ట్రోలింగ్


సినీ పరిశ్రమలో ఉన్న వారిపై సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకప్పుడు ట్రోలింగ్ బాధ తప్పదు. మరికొంత మంది నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వార్తలతో సతమతం అవుతూనే ఉంటారు. ఏ మాత్రం చిన్న తప్పు దొరికినా, దాన్ని పట్టుకుని నెటిజన్లు ఆటాడేసుకుంటారు. మరికొంత మంది అసభ్య పదజాలంతోనూ దూషణలకు దిగుతారు. అనుకోకుండా జరిగిన పొరపాటు అని తెలిసినా సరే, దారుణంగా కామెంట్ చేస్తుంటారు.  తాజాగా మృణాల్ ఠాకూర్ సైతం ఇలాంటి ఇబ్బంది పడుతోంది. కాబోయే భర్త గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ కు గురవుతున్నాయి.


అప్పుడు అలా, ఇప్పుడు ఇలా


కొద్ది రోజుల క్రితం మృణాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు, కాబోయే భర్త ఎలా ఉండాలి? అనే ప్రశ్న ఎదురయ్యింది.  “తనకు కాబోయే వాడు మంచి వాడు అయితే చాలు, అందం చూడను” అని చెప్పింది. తాజాగా మృణాల్ కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా తన భర్త చాలా అందంగా ఉండాలని చెప్పింది. ఇక ఈ రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లను పట్టుకుని నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. మృణాల్ అబద్దాల కోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవసరానికి అనుగుణంగా మాట మార్చుతుందంటూ మరికొంత మంది విరుచుకుపడుతున్నారు.


ట్రోలింగ్ పై మృణాల్ ఆవేదన


తాజాగా ఈ ట్రోలింగ్ పై మృణాల్ స్పందించింది. తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి వ్యక్తికి అభిప్రాయాలు మారుతూ ఉంటాయని చెప్పింది. నాకు అప్పుడు అలా అనిపించింది. ఇప్పుడు ఇలా అనిపిస్తుందని వెల్లడించింది. “చాలా మంది నెటిజన్లు సెలబ్రిటీలు కూడా మామూలు మనుషులే, వారికీ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఆ విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించడం మంచిది కాదు” అని చెప్పుకొచ్చింది. ఆమెకు మరికొంత మంది నెటిజన్లు సపోర్టు చేస్తున్నారు. మీరు ఇలాంటి ట్రోలింగ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.


ప్రస్తుతం మృణాల్ ఠాకూర్,  నాని  హీరోగా నటిస్తున్న 30వ చిత్రంలో నటిస్తోంది. శౌర్యువ్‌ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై చెరుకూరి మోహన్, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి, మూర్తి కలగర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు.






Reda Also: నా భర్తకు గతంలోనే పెళ్లైంది, విడాకులకు కారణం నేను కాదు: హన్సిక