హీరో అడివి శేష్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం 'మేజర్'. ముంబై ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శశి కిరణ్ తిక్కా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, మేకింగ్ వీడియోలు, పాటలను విడుదల చేయగా.. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.


ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది. పాండమిక్ కారణంగా సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల కారణంగా సినిమాను వాయిదా వేయాల్సి వస్తుందని.. దేశం కోసమే ఈ సినిమాను సిద్ధం చేస్తున్నామని.. కాబట్టి పరిస్థితులు అనుకూలించినప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పారు. అప్పటివరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.  







ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. GMB ఎంటర్టైన్మెంట్ , A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.










Also Read: గ్లామర్ షో ఓకే కానీ.. ఛాన్స్ లు దొరుకుతాయా..?


Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి