'మేజర్'... 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషించిన సంగతి తెలిసిందే. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన కథానాయిక సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా ధూళిపాళ నటించారు. వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా. ఓవర్సీస్, అమెరికాలో మే 26న ప్రీమియర్ షోలు వేయడానికి సినిమా టీమ్ రెడీ అయ్యింది. మరోసారి ఈ సినిమా విడుదల తేదీని అడివి శేష్ కన్ఫర్మ్ చేశారు. సినిమాలో ఉన్నదానికి టీజర్ జస్ట్ గ్లింప్స్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.






Also Read: వైసీపీతో త్రివిక్రమ్ ప్లాన్? అందుకే, 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు బండ్ల గణేష్ దూరమా? లీక్డ్ ఫోన్ కాల్‌లో నిజమెంత?


'మేజర్' సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ప్రై.లితో కలిసి సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.






వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 3', వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమాలు కూడా మే 27న విడుదలకు సిద్ధమయ్యాయి. వాటితో 'మేజర్' పోటీ పడనుంది. ఆ రెండు సినిమాలతో కంపేర్ చేస్తే... 'మేజర్' డిఫరెంట్ జానర్ సినిమా. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా.


Also Read: దగ్గుబాటి వారసుడితో తేజ సినిమా - 'అహింస', అది 'అఖండ'లో బాలకృష్ణ డైలాగే!