Actress Sharanya: ఫిదా సినిమాలో సాయి ప‌ల్ల‌వి త‌ర్వాత‌.. ఠ‌క్కున గుర్తొచ్చేది రేణుక క్యారెక్ట‌ర్. తెలంగాణ యాస‌లో మాట్లాడుతూ, స‌హ‌జంగా న‌టించి ఎంతోమంది ప్ర‌శంస‌లు పొందారు యాక్ట‌ర‌స్ శ‌ర‌ణ్య‌. ఒక‌ప్ప‌టి న్యూస్ రీడ‌ర్ ఇప్పుడు యాక్ట‌ర‌స్ గా మారింది. త‌న‌ని అంద‌రూ ఓన్ చేసుకున్నార‌ని, సినిమాలో ఉన్న క్యారెక్ట‌ర్ పేరుతోనే పిలుస్తూ ఆద‌రిస్తున్నార‌ని చెప్పారు. ఈమ‌ధ్యే ఆమె న‌టించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా రిలీజై స‌క్సెస్ అందుకుంది. ఇక ఆ విశేషాలు పంచుకున్నారు శ‌ర‌ణ్య‌. ఫిదా త‌ర్వాత త‌న‌కు బ్రేక్ ఇచ్చింది ఈ సినిమానే అని చెప్పుకొచ్చారు. 


సొంత అమ్మాయిలా చూసుకుంటున్నారు.. 


‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ స‌క్సెస్ ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాన‌ని అంటున్నారు యాక్ట‌ర‌స్ శ‌ర‌ణ్య‌. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ స‌క్సెస్ ని బాగా ఎంజాయ్ చేశాను. ‘‘ ప్ర‌మోష‌న్స్, స‌క్సెస్, థియేట‌ర్ల‌లో తిర‌గ‌డం, ఆ కేక‌లు అన్నీ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ‘భామా కలాపం - 2’ స‌క్సెస్ హ్యాపీగా అనిపిస్తుంది. రెండు స‌క్సెస్ లు ఒకేసారి వ‌స్తే నిద్ర ఉండ‌దు. టైం స‌రిపోదు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. న‌న్ను త‌మ ఇంట్లో అమ్మాయిలా ఓన్ చేసుకున్నారు ప్రేక్ష‌కులు. ఫిదా సినిమాలో రేణుకను ఎలా త‌మ ఇంట్లో పిల్ల అనుకున్నారో. ఇప్పుడు ప‌ద్దుని కూడా అలానే ఫీల్ అవుతున్నారు. ప‌ద్మ‌క్క‌, ప‌ద్మ‌క్క అని పిలుస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఫిదా త‌ర్వాత బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఫిదా సినిమాకి మంచి పేరు వ‌చ్చింది. కానీ, త‌ర్వాత కాల్స్ రాలేదు. ఆ త‌ర్వాత బ్రేక్ ఇచ్చింది మాత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. క్రేజీ, క్రేజీ ఫిలింగ్, శైల‌జా రెడ్డి అల్లుడు లాంటివి చేశాను. ఎంచుకుని సినిమాలు చేశాను. ఖుషి సినిమాలో ఎంత వ‌ర‌కు కావాలో అంత‌వ‌ర‌కు ఉంచారు. ఆ కొంచెంసేపు చేసినా చాలా బాగా అనిపించింది ఆ క్యారెక్ట‌ర్’’  అంటూ త‌న సినిమా విశేషాలు పంచుకున్నారు శ‌ర‌ణ్య‌.  "ఇక ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’  సినిమాకి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. తెలంగాణ యాస బాగా వ‌స్తుంది నాకు. కానీ, అందులో గోదావ‌రి యాస రావాలి. ఎవ‌రైనా తెలంగాణ యాస నేర్చుకుని మాట్లాడితే.. నేను గుర్త‌ప‌ట్టేస్తా. అలా న‌న్ను ఎవ్వ‌రూ అనొద్దు అందుకే, చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా. అలా ప్ర‌తి క్యారెక్ట‌ర్ కి 100 శాతం ఇవ్వాలి అనుకుంటాను" అని 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' గురించి చెప్పారు శ‌ర‌ణ్య‌.


శేఖ‌ర్ క‌మ్ములా డైరెక్ట్ చేసిన సినిమా ‘ఫిదా’. ఆ సినిమాలో వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్లవి న‌టించారు. దాంట్లో సాయి ప‌ల్ల‌వి అక్క‌గా న‌టించింది శ‌ర‌ణ్య‌. న్యూస్ రీడ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని ఎవ‌రో చెప్తే ఒక ట్రైల్ వేశాన‌ని, అలా క్యారెక్ట‌ర్ కి సెలెక్ట్ అయిపోయాన‌ని త‌న సినిమా ఇండ‌స్ట్రీ ఎంట్రీ గురించి చెప్తారు శ‌ర‌ణ్య‌. ఇక ‘ఫిదా’ త‌ర్వాత ఎన్నో క్యారెక్ట‌ర్లు చేశారు శ‌ర‌ణ్య‌. తెలంగాణ‌యాస‌లో స్ప‌ష్టంగా మాట్లాడ‌టం ఆమెకు ప్ర‌తి  క్యారెక్ట‌ర్ లో క‌లిసి వ‌చ్చే అంశం. ఇక ఇప్పుడు ఆమె, ప్రియ‌మ‌ణి క‌లిసి న‌టించిన ‘భామాక‌లాపం - 2’ సినిమా ఆహా ఓటీటీలో దూసుకుపోతోంది. 


Also Read: మేం ఏం ద్రోహం చేశాం.. క‌న్నీళ్లు పెట్టుకున్న శుభ‌లేఖ సుధాక‌ర్