హీరోయిన్స్ విషయంలో చాలా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అందుకు రష్మీ గౌతమ్ (Rashmi Gautam) కూడా అతీతం ఏమీ కాదని చెప్పాలి. ఆవిడపై చాలా రూమర్స్ వచ్చాయి. అందులో లేటెస్ట్ ఏంటంటే... 'రష్మీ గౌతమ్‌కు ప్రముఖ హీరో ఒకరు విల్లా గిఫ్ట్‌గా ఇచ్చారట! ఎవరా హీరో?' ఓ యూట్యూబ్ ఛానల్ థంబ్ నైల్ పెట్టింది. 


ప్రజెంట్ 'శ్రీదేవి డ్రామా కంపెనీ'కి రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆ థంబ్ నైల్ చూపించారు. 'హైపర్' ఆది ఏమో సునిశిత్ అంటూ కామెడీ చేశారు. 'రష్మీ... ఎవరా హీరో?' అంటూ ఇంద్రజ అడిగారు. ''ఒక అమ్మాయిగా మేం ఫ్లాట్, విల్లాలు కొంటే... మా సొంత డబ్బులతో, కష్టపడిన సొమ్ముతో కొంటే... అది ఎవరో ఇచ్చారని ఫిక్స్ అయిపోతారా? ఏంటి?'' అని రష్మీ గౌతమ్ ప్రశ్నించారు. అందులో కొంచెం కోపం కూడా ఉంది. 


సొంత డబ్బుతో కొనుకున్నా!
'ఆ హీరో ఎవరు?' అని ప్రశ్నిస్తున్నారు. ''ఆ హీరో ఎవరో కాదు... నేనే! నా సొంత డబ్బులతో నా ఫ్లాట్స్ గానీ, నా కార్స్ గానీ, నా విల్లాలు గానీ కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నాను. ఇటువంటి థంబ్ నైల్స్ నమ్మకండి. డే అండ్ నైట్ కష్టపడి షూట్ చేస్తాం. వర్క్ చేసి చెక్ తీసుకుంటాం'' అని రష్మీ గౌతమ్ వివరించారు. ఒక్కటి మాత్రం నిజం... ఇటీవల ఆవిడ విల్లా కొన్నారన్నమాట!


హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, కేథరిన్ త్రేసా, లావణ్యా త్రిపాఠి  భాగ్య నగరంలో ఫ్లాట్స్ కొన్నప్పుడు ఈ విధమైన రూమర్స్ వచ్చాయి. ఇంతకు ముందు హీరోయిన్స్ విషయంలో ఇదే విధంగా మరికొన్ని రూమర్స్ వచ్చాయి. అప్పుడు వాళ్ళు వాటిని ఖండించారు. అదే విధంగా ఇప్పుడు రష్మీ గౌతమ్ కూడా ఖండించారు. 


రష్మీ ప్రేమ విషయంలోనూ ఇంతే!
'ఎక్స్ట్రా జబర్దస్త్' కారణంగా రష్మీ గౌతమ్ ప్రేమ విషయంలో కూడా రూమర్స్ వస్తూ ఉన్నాయి. 'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్... ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా మంది నమ్ముతున్నారు. తాము మంచి స్నేహితులం మాత్రమే అని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఆ రూమర్స్ ఆగడం లేదు. 


Also Read : త్రివిక్రమ్ - ప్రేక్షకుడితో నడిచే జీవితం, ఎప్పటికీ మరువలేని పుస్తకం! ఆయన్ను ఎందుకు గురూజీ అంటున్నారు?


ఒకవైపు టీవీ షోలు చేస్తూనే... మరోవైపు సినిమాలు కంటిన్యూ చేస్తున్నారు రష్మీ గౌతమ్. 'జబర్దస్త్' నుంచి అనసూయ తప్పుకోవడంతో కొన్ని రోజులు ఆమె యాంకరింగ్ చేశారు. ఇటీవల టీవీ ఆర్టిస్ట్ సౌమ్య రావును తీసుకు వచ్చారు. ఇప్పుడు ఆవిడ 'జబర్దస్త్'కు యాంకరింగ్ చేస్తున్నారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్'కి మాత్రం ఎప్పటిలా రష్మీ కంటిన్యూ అవుతున్నారు.


సినిమాల్లో రష్మీ బిజీ అవుతారా?
'జబర్దస్త్' నుంచి రష్మీని ఎందుకు తీసేశారు? అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ అవుతోంది. కథానాయికగా ఆవిడ నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా ఈ మధ్య విడుదల అయ్యింది. మళ్ళీ సినిమా అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో పాటు 'శ్రీ దేవి డ్రామా కంపెనీ'కి కూడా రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్నారు. టీవీ షోస్ ఎక్కువ అయితే సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుందేమోనని ముందు జాగ్రత్త పడుతున్నారని టాక్.