టి ప్రత్యూష ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2002 లో జరిగిన ఆ  సంఘటన ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు, తమిళ్ సినిమాల్లో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ప్రత్యుషా సడెన్ గా ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్తలు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ప్రత్యూష తల్లి సరోజిని దేవి చాలా కాలం న్యాయం కోసం పోరాడారు. ఆ విషాద ఘటన జరిగి దాదాపు 20 ఏళ్ళు గడుస్తోంది. దీనిపై ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఐటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాలను బయట పెట్టారు. చనిపోయే ముందు రోజు ప్రత్యూష తాను ప్రేమించిన అబ్బాయి సిద్దార్థ్ రెడ్డి తో బయటకు వెళ్లిందని, ఆ సమయంలో జయం సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఓకే చేసారని, జయం ఆఫీస్ కు వెళ్లి వస్తానని చెప్పిందని అయితే అదే ఆమె చివరి మాటలు అవుతాయని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 


తన కూతురు చనిపోయిన మూడు రోజుల తర్వాత తాను తన కూతురు చనిపోయిన ఆసుపత్రికి వెళ్లి అక్కడ పని చేసేవాళ్ళతో మాట్లాడితే అసలు విషయం తెలిసిందని చెప్పారు. ఆరోజు ఒక కారు వేగంగా ఆసుపత్రికి వచ్చిందని, అందులో నుంచి ఒక అమ్మాయిని వీల్ చైర్ లోకి తీసుకెళ్లారని, అప్పటికే ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి ఉందని వీల్ చైర్ లో ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పారని తెలిపారు. ‘‘నిజంగా అమ్మాయితో పాటు అబ్బాయి కూడా విషం తాగితే సిద్దార్థ్ రెడ్డి ఆసుపత్రి వరకూ ఎలా వచ్చారు? ఎలా ఫస్ట్ ఫ్లోర్ వరకూ వెళ్ళాడు?’’ అని  అనే ప్రశ్నించారు. అనుమానం రాకూడదు అనే సిద్దార్థ్ కూడా ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు అందరిని నమ్మించారని అన్నారు. ప్రత్యూష కు సంబంధించిన బట్టలు కూడా ఇవ్వలేదని సరోజిని దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఇవ్వలేదని అడిగితే ప్రత్యూష చికిత్స సమయంలో మోషన్ చేయడం వలన వాటిని వర్కర్స్ అన్నింటితోపాటు పడేసుంటారని ఆసుపత్రి వాళ్ళు సింపుల్ గా చెప్పేశారని గుర్తు చేసుకున్నారు. ఆసుపత్రి వైద్యులే ఆధారాలను మాయం చేసారని ఆరోపించారు. 


కేసును కావాలనే పక్కదారి పట్టించారని అన్నారు. ఏం జరిగిందని ఆరా తీస్తే భయానక విషయాలు బయటకు వచ్చాయని సరోజిని దేవి చెప్పింది. కొంతమంది కలిసి తన కుమార్తెను నాలుగైదు గెస్ట్ హౌస్ లకు మార్చి నరకయాతన చూపించారని వాపోయింది. తన కుమార్తెను ఘోరంగా హింసించారని, అందుకే తన కుమార్తె చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతోన్న తనకు బెదిరింపు కాల్స్ కూడా  వచ్చాయని ఆమె అన్నారు. ఎంత తిరిగినా న్యాయం జరగదని బెదిరించే వారని తెలిపారు. అయినా తాను భయపడలేదని పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాడి పోరాడి అలసిపోయానని చెప్పారు సరోజిని. 20 ఏళ్ళ తర్వాత కూడా తన కుమార్తెను తలుచుకొని రోజూ బాధపడుతున్నానని అన్నారు. తమ కుమార్తెను హింసించిన వారికి కచ్చితంగా ఆ దేవుడే శిక్ష విధిస్తాడని తెలిపారు. 


Also read: కన్నింగ్ ఆటతో గెలుద్దామని ప్లానేసి ఓడిపోయిన గీతూ,వెక్కి వెక్కి ఏడుపు- చేపల టాస్కు అదిరిపోయింది