Actress Pooja Hegde Next Movie: మార్చి 2023లో  విశ్వనటుడు కమల్ హాసన్ కీలక ప్రకటన చేశారు. శింబు తర్వాతి చిత్రాన్ని తానే నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయన అన్నట్లుగానే శింబు లేటెస్ట్ మూవీ 'STR 48'లో  ప్రీ ప్రొక్షన్ పనులు మొదలయ్యాయి. దేశింగ్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అకాశం ఉంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతున్న ఈ సినిమాను  RKFI, టర్మెరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.  


శింబు మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే  


కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం శింబు ఎంతో కష్టపడుతున్నారట. ఈ సినిమా కోసం థాయ్ లాండ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ చిత్రంలో శింబు డ్యూయెల్ రోల్ పోషించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, చిత్రం బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించారట. శింబు సరసన హీరోయిన్ గా నటించేందుకు తను కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


త్వరలోనే హీరోయిన్ ఎంపికపై మేకర్స్ అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి తొలి వారం లేదంటే రెండో వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. అదే సమయంలో టీజర్ ను కూడా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా సినిమాలో నటించే స్టార్స్, టెక్నికల్ టీమ్ ను పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి స్థాయిలో యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.


‘పత్తు తల’తో బ్లాక్ బస్టర్ హిట్


ఇక శింబు చివరగా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ‘పత్తు తల’లో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 30 మార్చి 2023న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా, ఇసుక మాఫియా నేపథ్యంలో రూపొందింది.  ఈ సినిమాలో శింబు ఏజీఆర్‌గా నటించారు. ఇది శివరాకుమార్ కన్నడ చిత్రం ‘మఫ్తీ’కి రీమేక్ గా రూపొందింది. ఒబేలి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ కృష్ణ, ప్రియా భవాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తర్వాత వస్తున్న  'STR 48' పైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని శింబు అభిమానులు భావిస్తున్నారు.


Read Also: అలాంటి భర్త కావాలంటున్న 'యానిమల్' బ్యూటీ - పెళ్లి గురించి ఏం చెప్పిందంటే?