Actress Parineeti Chopra Feels Guilty For Following Wrong Advice: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తాజాగా ‘అమర్ సింగ్ చమ్కిలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె అమర్ జ్యోత్ కౌర్ పాత్రలో ఒదిగిపోయి నటించింది. సినీ అభిమానులతో పాటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కెరీర్ లో చాలా తప్పులు చేసినట్లు వెల్లడించింది. సినిమా పరిశ్రమలో అనుభవం లేని కారణంగా పలువురు ఇచ్చిన సలహాలను పాటించానని, అయితే, వాటి కారణంగా తన కెరీర్ లో చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పింది.


వారి సలహాలు పాటించి తప్పు చేశా- పరిణీతి


ఏ వ్యక్తీ తమ జీవితంలో అన్నీ సరైన నిర్ణయాలు తీసుకోలేరని, ఎక్కడో ఒకచోట తప్పులు చేస్తూ ఉంటారని పరిణీతి వెల్లడించింది. “నేను సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత కొంత మంది నాకు సలహాలు ఇచ్చారు. అయితే, ఇండస్ట్రీలో నాకు పెద్దగా అనుభవం లేని కారణంగా వారు ఇచ్చిన సలహాలను పాటించాను. తన కెరీర్ కు వారి సలహాలు బాగా ఉపయోగపడతాయని అనుకున్నాను. కానీ, ఆ సలహాలు నాకు అనుకున్న స్థాయిలో ఉపయోగపడలేదు. నేను తప్పు చేశాను అని గిల్టీగా ఫీలయ్యాను. నిజానికి తెలియక చేసిన తప్పుకు ఫలితాన్ని అనుభవించాను. అయితే, నా మీద నేను నమ్మకంతో, ఇతరుల సలహాలు పాటించి ఉండకపోతే, ఈ రోజు నా కెరీర్ మరోలా ఉండేది అనిపిస్తుంది” అని పరిణీతి అభిప్రాయపడింది.   


ఇకపై టాలెంట్‌ను నమ్ముకుంటాను- పరిణీతి


సినిమాల సెలెక్షన్స్ విషయంలోనూ చాలా కొన్ని పొరపాట్లు చేసినట్లు పరిణీతి తెలిపింది. “సినిమా ఎంపికల విషయంలో ట్రెండ్స్‌‌ను అనుసరించాలని తన చుట్టూ ఉన్న వాళ్లు సలహాలు ఇస్తున్నారు అనుకున్నాను. నా ఫ్యాషన్ నిర్ణయాలను కూడా ప్రభావితం చేశారు. కానీ, వాటి ఫలితాలు త్వరలోనే నాకు తెలిసి వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి సలహాలు పాటించకూడదు అనుకున్నాను. నేను ఏం చేయాలో ఇప్పుడు నాకు బాగా అర్థం అయ్యింది. దర్శకులు, నిర్మాతలు తన ప్రతిభ గుర్తిస్తే చాలా అని భావిస్తున్నాను. నా ప్రతిభను గత సినిమాలు చూసి గుర్తించడం మానుకోవాలని కోరుకుంటున్నాను. ‘అమర్ సింగ్ చమ్కిలా’ సినిమా నా కెరీర్ కు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇకపై టాలెంట్ ను నమ్ముకుని ముందుకు సాగాలి అనుకుంటున్నాను” అని పరిణీతి చెప్పుకొచ్చింది.


తాజాగా పరిణీతి ‘అమర్ సింగ్ చమ్కిలా’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ హీరోగా నటించారు.లెజెండరీ సింగర్ భార్య అమర్‌ జోత్ పాత్రను  పరిణీతి చోప్రా పోషించారు. ఈ చిత్రం గత వారం ఏప్రిల్ 12న నెట్‌ఫ్లి క్స్‌ లో విడుదలైంది. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.


Read Also: గ్రాఫిక్స్‌లో సింహాన్ని క్రియేట్ చేసే బడ్జెట్ లేదు, అందుకే బాటిల్ మూతతో అలా చేశాం - ‘గామి’ దర్శకుడు విద్యాధర్