Mrunal About Her Body Shape: మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని రీతిలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. సౌత్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లోనూ ఛాన్సులు దక్కించుకుంటోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక తన డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా అందరినీ కట్టిపడేస్తుంది. చీరలో సంప్రదాయబద్దంగా కనిపించడంతో పాటు మోడ్రన్ డ్రెస్సుల్లో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. రీసెంట్ ఫిలింఫేర్ అవార్డ్స్‌ వేడుకలో స్టైల్ ఐకాన్‌గా మారిపోయింది. ఆకర్షణీయమైన సీ త్రూ గౌను ధరించి అందరినీ కనువిందు చేసింది.

  


మన శరీరం ఎలా ఉన్నా ఇష్టపడాల్సిందే!


ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తన బాడీ గురించి వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందించింది. మన శరీరం ఎలా ఉండాలనేది మన చేతుల్లో లేదని చెప్పింది. మనం తీసుకునే జాగ్రత్తల కారణంగా కొంత మేర మార్చుకోగలమే తప్ప, పూర్తి స్థాయిలో సరి చేయలేమని చెప్పారు. “నేను వర్కౌట్స్ కోసం వెళ్లినప్పుడు జిమ్ ట్రైనర్లు నా పిరుదుల వైపు ఫోకస్ చేస్తారు. ఎలా ఉండాలో చెప్తారు. కానీ, ఇది మీ సమస్య కాదు, నా సమస్య అని చెప్తాను. నా శరీరం నా బలం. నేను ఎలా ఉన్నా ఆనందంగా స్వీకరిస్తాను. నాకు సమస్య లేనప్పుడు మీకు ఎందుకు? అని అడుగుతాను” అని చెప్పింది.


మీ శరీరాన్ని మీరు ప్రేమించండి!


శరీర నిర్మాణం మన చేతుల్లో లేని విషయం అని మృణాల్ వెల్లడించింది. “మీ శరీరం గురించి మీరు ఏం చేయలేని కొన్ని విషయాలు ఉన్నాయి. సహజంగానే కొన్ని శరీర భాగాలు వైకల్యంతో రావచ్చు. అలాంటి మహిళల పట్ల వివక్షణ చూపించడం భారతీయులకు అలవాటుగా మారింది. ఎందుకు వారిని చిన్న చూపు చూస్తారో అర్థం కాదు. ఉన్న శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన శరీరం ఎలా ఉన్నా బాధపడాల్సిన అవసరం లేదు. రిచ్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. శరీరం ఆరోగ్యంగా ఉండేలా ఆహారం తీసుకుంటే చాలు. నా తొడలు లావుగా ఉంటాయి. అయినా, నాకు ఎలాంటి బాధ లేదు. మీరు కూడా మీ శరీరాన్ని ప్రేమించండి” అని చెప్పుకొచ్చింది.


ఆ రోజు చాలా సంతోషం కలిగింది!


గతంలో బరువు తగ్గేందుకు ప్రయత్నించి ట్రోలింగ్ కు గురైనట్లు మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది.“వాస్తవానికి నేను గతంలో బరువు తగ్గడానికి ప్రయత్నించాను. నా ముఖం పీలగా మారిపోయింది. శరీరం పై భాగం, కింది భాగం సన్నగా మారింది. నన్ను చూసి చాలా మంది మట్కా(కుండ)లా ఉన్నావు అంటూ ఎగతాళి చేశారు. అప్పుడు ఎంతో బాధపడ్డాను. ఓసారి అమెరికాకు వెళ్లినప్పుడు చాలా మంది నన్ను ఇండియన్‌ కర్దాషియన్‌ అని పిలిచారు. నాలాంటి శరీర రూపం కోసం బోలెడు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది” అని మృణాల్ వెల్లడించింది. రీసెంట్ గా ‘హాయ్‌ నాన్న’ మూవీలో కనిపించిన మృణాల్‌ ఠాకూర్‌, ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రంలో నటిస్తున్నది.


Read Also: LSD ట్రైలర్ - ఆ ఓటీటీలోకి వచ్చేస్తున్న అడల్ట్ సీరిస్ - దిల్ రాజు డైలాగ్‌ను ఇలా వాడేశారు!