ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ విచారం వ్యక్తం చేస్తోంది. మీనా కుటుంబానికి సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలిపారు. కొందరు సెలబ్రిటీలు మీనా ఇంటికి చేరుకొని విద్యాసాగర్ కి నివాళులు అర్పించారు. కరోనా బారిన పడ్డ ఆయన కొన్నాళ్లకు కోలుకున్నారు కానీ శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆ కారణంగానే విద్యాసాగర్ మరణించినట్లు డాక్టర్స్ చెబుతున్నారు. అయితే ఆయన మరణంపై విభిన్న కథనాలను ప్రచురిస్తున్నారు. 


విద్యాసాగర్ మరణానికి పావురాలే కారణమంటూ ప్రచారం జరుగుతోంది. మీనా ఇంటి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉన్నాయని.. అవి విడిచిన వ్యర్ధాల నుంచి వచ్చిన గాలి పీల్చడంతో విద్యాసాగర్ ఆరోగ్యం దెబ్బతిని మరణించారని కథనాలను ప్రచురిస్తున్నారు. ఈ వార్తలపై నటి ఖుష్బూ ఖండించగా.. తాజాగా ఈ విషయంపై మీనా స్వయంగా స్పందించింది. 


ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ఒక పోస్ట్ పెట్టింది. 'నా భర్త విద్యాసాగర్ మరణం నన్ను ఎంతగానో బాధిస్తోంది. ఇలాంటి సమయంలో నా ప్రైవసీ భంగం కలిగించకుండా ఉండాలని మీడియాను కోరుతున్నాను. దయచేసి ఇకనుంచి ఈ విషయంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి. ఈ కష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తమ శాయశక్తులా ప్రయత్నించిన వైద్య బృందానికి, మన ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, రాధాకృష్ణన్ IAS, సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీడియా, అభిమానులకు ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చింది. 


Also Read: మాది 'పవిత్ర' బంధం, మేం మంచి స్నేహితులం - రూమర్స్‌పై నరేష్ స్పందన


Also Read: బిగ్ బాస్ బ్యూటీకి 'జబర్దస్త్' ఛాన్స్ - అనసూయ రేంజ్ లో క్లిక్ అవుతుందా?