సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే వారిలో కొంత మంది మాత్రమే పరిశ్రమలో నిలదొక్కుకుంటారు. కొంత మంది నటీనటులు సరైన అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి దూరం అవుతారు. ఇంకొంత మంది కెరీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఉన్నట్టుండి సినిమాలకు దూరం అవుతారు. అలాంటి హీరోయిన్ లలో నటి లయ ఒకరు. తెలుగులో ఈమె నటించింది తక్కువ చిత్రాలే అయినా తన అందం, అభినయంతో తెలుగు వారికి ఎంతగానో దగ్గరైంది. హీరో వేణు నటించిన ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లయ. ఈ సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వరుసగా సినిమాలు చేసినా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే చాలా రోజుల తర్వాత నటి లయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన సినిమా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం లయ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నా పెళ్లికి పవన్ కల్యాణ్ అలా చేశారు: లయ
నటి లయ ఇంటర్వ్యూ లో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘‘నా పెళ్లికి ఆహ్వానించడం కోసం నేను మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లా. అయితే చిరంజీవితో ముందే పరిచయం ఉండటంతో ఆయనకు కార్డు ఇచ్చి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాం. కానీ పవన్ కల్యాణ్ తో నాకు అసలు పరిచయమే లేకపోవడంతో ఎలా రెస్పాండ్ అవుతారో అనే టెన్షన్ తోనే వెళ్లాం. కానీ ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నాతో పరిచయం లేకపోయినా ఆయన మాట్లాడే విధానం చూసి ఆశ్చర్యపోయాం. పెళ్లికి తప్పకుండా వస్తా. అయితే పెళ్లి రిసెప్షన్‌కి పవన్ రారేమో అనుకున్నా. కానీ అందరికంటే ముందే ఆయన అక్కడకు వచ్చారని చెప్పారు లయ. ఆయన తన రిసెప్షన్‌కు రావడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పుకొచ్చారామె.
పవన్ కల్యాణ్ కు ఆ చరిష్మా ఉంది: లయ
ఇదే ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ సీఎం అవుతారా అని అడిగితే.. తనకు రాజకీయాల గురించి అంతగా తెలియదని. అయితే పవన్ కల్యాణ్ కు సీఎం అయ్యే చరిష్మా కచ్చితంగా ఉందని చెప్పారు. ఆ సీఎం కుర్చీకు పవన్ కల్యాణ్ తగిన వాడని చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారో వేచి చూడాలని తెలిపారు. ఆయన సీఎం అయినా అవ్వకపోయినా పవన్ ఎప్పుడూ టాప్ పొజిషన్ లోనే ఉంటారని వ్యాఖ్యానించింది.
అవకాశాలు వస్తే మళ్లీ సినిమాలు చేస్తా: లయ
మెగా స్టార్ చిరంజీవి సినిమాలో ఆయన పక్కన నటించే అవకాశం వస్తే ఇప్పుడు చేస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు లయ. చిరంజీవి లాంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం వస్తే ఎందుకు చేయకుండా ఉంటాను అని చెప్పారు. ఎలాంటి పాత్ర అయినా సరే ఆయన తో నటించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. అంతే కాకుండా మంచి క్యారెక్టర్ లు వస్తే సినిమాలు చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు హింట్ ఇచ్చారు లయ.
Also Read : అగ్ని ప్రమాదానికి గురైన మెగాస్టార్ మూవీ సెట్ - దాని కాస్ట్ ఎంతంటే?