తన వయసుకి తగినట్లుగా.. వైవిధ్యమైన పాత్రలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు విక్టరీ వెంకటేష్. ఈ ఏడాదిలో 'నారప్ప', 'దృశ్యం 2' వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వెంకీ ఈరోజు 61వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెంకీకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం వెంకీకి విషెస్ చెబుతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. 

 

తాజాగా నటి ఖుష్బూ.. వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. వీరిద్దరూ కూడా తెలుగులో 'కలియుగ పాండవులు' అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని తన పోస్ట్ లో ప్రస్తావించింది కుష్బూ. వెంకీకి విషెస్ చెబుతూ.. నీ విషయంలో నేను చాలా సెంటిమెంట్ ఫీల్ అవుతానని.. ఇద్దరం కలిసి ప్రయాణం మొదలుపెట్టాం.. 35 ఏళ్ల తరువాత ఇప్పటికీ కూడా ఒకరిపైమరొకరికి ప్రేమ, గౌరవం అనేవి పోలేదని ఎమోషనల్ గా రాసుకొచ్చింది. 

 





 

మరోపక్క వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న వెబ్ సిరీస్ లో వెంకీ పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేశారు. అందులో నెరిసిన జుట్టు, గడ్డం, చెవి పోగుతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు వెంకీ. ఇందులో ఆయన రానా నాయుడు అనే పాత్ర పోషిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ సిరీస్ లో రానా కూడా నటించబోతున్నారు.