Actress JayaSudha About Chiranjeevi: స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌.. ఎంతోమంది యాక్ట‌ర్స్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించి మంచి పేరు, కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టి. ఇప్ప‌టికీ ఎంతోమంది హీరోల‌కు అమ్మ‌గా, అక్క‌గా, వ‌దిన‌గా న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు ఆమె. ఇక ప్రొడ్యూస‌ర్ గా కూడా ఎన్నో సినిమాలు చేశారు జ‌య‌సుధ‌. రాజ‌కీయ నాయ‌కురాలిగా రానించారు. చాలా రోజులుగా మీడియాకి దూరంగా ఉంటున్న ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. దాంట్లో ఆమె త‌నకు సంబంధించిన ఎన్నెన్నో విష‌యాల‌ను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. 


నిజ జీవితంలో బ్యాడ్ యాక్ట‌ర్.. 


జ‌య‌సుధ ప్రొడ్యూస‌ర్, నాగ‌బాబు హీరోగా.. ‘హ్యాండ్స్ అప్’ సినిమా చేశారు. ఆ సినిమాలో చిరంజీవి క్లైమాక్స్‌లో యాక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా గురించి ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన జ‌య‌సుధ‌.. చిరంజీవి నిజ‌జీవితంలో బ్యాడ్ యాక్ట‌ర్ అని, అబ‌ద్దం చెప్ప‌డం ఆయ‌న‌కు రాదు అని అన్నారు. 


"'హ్యాండ్స్ అప్' సినిమా చేస్తున్న‌ప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి ఏం ప్రొడ్యూస‌ర‌మ్మ నాకు ఒక క్యారెక్ట‌ర్ ఇస్తారా? అని జోక్ గా అడిగారు. అయితే, ఆ త‌ర్వాత నిజంగానే క్లైమాక్స్ లో ఒక ప‌వ‌ర్ ఫుల్ హీరో ఎంట్రీ ఇవ్వాలి. దీంతో అప్పుడు శివ‌నాగేశ్వ‌ర‌రావు, నేను చిరంజీవిని అడిగాము. అయితే, ఆయ‌న మొద‌ట్లో ఒప్పుకోలేదు. మ‌న వాళ్ల‌కి ఇంకా హాలీవుడ్, బాలీవుడ్ త‌ర‌హా సినిమాల మైండ్ సెట్ రాలేదు. చిరంజీవి ఇంత చిన్న క్యారెక్ట‌ర్ చేశారు అనుకుంటారు అన్నారు. ఆ త‌ర్వాత సినిమా స్టోరీ లైన్ చెప్పాను. చెప్పేట‌ప్పుడు చాలా న‌వ్వారు ఆయ‌న. ఆ త‌ర్వాత ఓకే చెప్పారు. సినిమా షూటింగ్ అయిపోయింది. ప్రీమియ‌ర్స్ వేశాము. చిరంజీవి గారు ప్రీమియ‌ర్ చూసి.. బ‌య‌టికి వ‌చ్చారు. నిజానికి ఆయ‌న రియ‌ల్ లైఫ్ లో గొప్ప న‌టుడు కాదు. మ‌న‌సులో ఏదున్న చెప్పేస్తారు. నిజానికి మేమంతా అలానే.. ఏదైనా సినిమా చూసి బ‌య‌టికి వ‌స్తే భ‌యం. ఆ సినిమా గురించి ఏం చెప్పాలా? అని. అలా థియేట‌ర్ బ‌య‌టకి వ‌చ్చిన చిరంజీవి గారి మొహం మారిపోయింది. "నేను మ‌ళ్లీ మాట్లాడ‌తాను నీతో" అని చెప్పి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ.. ఫోన్ చేసి.. స్టోరీ చెప్పేట‌ప్పుడు చాలా న‌వ్వుకున్నాం. అక్క‌డ క‌నిపించ‌లేదు ఏంటి?. ఏం జ‌రిగింది? అస‌లు అని అన్నారు. త‌మ్ముడు నాగ‌బాబు తీసిన సినిమా, జ‌యసుధ సినిమా నెగ‌టివ్ గా చెప్తే వాళ్లు ఏం అనుకుంటారో అని లేదు ఆయ‌న‌కి. అలా త‌న మ‌న‌సులో మాట చెప్పేశారు. ఏమో సార్ ఏం జ‌రిగిందో అర్థం కావ‌డం లేదు అని చెప్పాను. అలా జ‌రిగింది ఆ సినిమా విష‌యంలో.. అని చెప్పారు జ‌య‌సుధ‌. 


ఇక ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలు చేశారు జ‌య‌సుధ‌. ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకొని శోభన్ బాబు, చిరంజీవి వంటి నటులతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. ఇక రాజ‌కీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్న జ‌య‌సుధ‌. ఇటీవ‌ల బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. 


Also Read: అరే ఏంట్రా ఇది - పెట్టింది రూ.45 కోట్లు, వచ్చింది రూ.38 వేలు, ఇంతకీ ఆ ఘోరమైన ఫ్లాప్ మూవీ ఏమిటో తెలుసా?