తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగు పెట్టిన అందాల తార ఛార్మి.. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన అందచందాలకు తోడు చక్కటి నటనతో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కొద్ది రోజుల్లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఆ తర్వాత నెమ్మదిగా వెండి తెరకు దూరమయ్యారు. తెర మీద కనిపించడం మానేసినా.. సినిమా పరిశ్రమలో కొనసాగారు. మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా మారి, సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. ‘పూరి కనెక్ట్స్‘ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీరిద్దరు కలిపి నిర్మించిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా తెరకెక్కిన లైగర్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయినా.. ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు.
ట్విట్టర్ కు ఛార్మి బ్రేక్..
ఓ వైపు సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నా.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఛార్మి. ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. లైగర్ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. సినిమాలను సంబంధించిన అప్డేట్స్తో పాటు, తన వ్యక్తిగత వివరాలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. అయితే ఛార్మి తాజాగా కీలక విషయాన్ని వెల్లడించారు. సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. “చిల్ గాయ్స్! సోషల్ మీడియా నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. పూరీ కనెక్ట్స్ తో మళ్లీ పెద్ద విషయంతో తిరిగి వస్తా. అప్పటి వరకు బతకండి, బతకనివ్వండి” అని ప్రకటించారు.
విరామానికి కారణం ఇదేనా?
ఛార్మి చేసిన తాజా ప్రకటనతో సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియా నుంచి ఛార్మి ఎందుకు విరామం తీసుకున్నారు? అని ఆలోచిస్తున్నారు. ఛార్మికి ప్రస్తుతం ట్విట్టర్ లో ఆరున్నర లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఛార్మి సన్నిహితులు మాత్రం ఆమె ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటం వల్లే సోషల్ మీడియాకు విరామం ప్రకటించారని చెబుతున్నారు. తాజాగా ఆమె నిర్మాతగా వ్యవహరించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం పొందింది. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని భాషల్లోనూ డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతగా కోలుకోలేని దెబ్బ తిన్నారు. అయినా విజయ్ దేవరకొండతో కలిసి పూరి జగన్నాథ్ ‘జన గణ మన‘ అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నందునే ఛార్మీ సోషల్ మీడియాకు విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది.
గతంలోనూ ట్విట్టర్ కు విరామం
ఇప్పుడే కాదు.. గతంలోనూ ఛార్మి ఓసారి ట్విట్టర్ కు విరామం ప్రకటించారు. లైగర్ సినిమా ప్రారంభం సమయంలో కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. మళ్లీ ఏ న్యూస్ తో సోషల్ మీడియాలో అడుగు పెడుతారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం
Also Read : ఫ్లాప్‌లతో కట్టిన స్టార్‌డమ్ కోట - పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరే లెవల్