Dhanush ‘Kubera’ Movie Shooting: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న మూవీ ‘కుబేర’. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఖాకీ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగగా.. తాజా షెడ్యూల్ ముంబైలో కొనసాగుతోంది.  


డంపింగ్ యార్డులో 10 గంటలకు పైగా షూటింగ్


ఇక ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. ధనుష్ ఈ మూవీ కోసం చాలా కష్టపడుతున్నారు. కీలక సన్నివేశం కోసం ఏకంగా 10 గంటల పాటు డంప్ యార్డులో గడిపినట్లు తెలుస్తోంది. ఈ టైమ్ లో ఆయన కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదట. సినిమాలోని ప్రతి సన్నివేశం నేచురల్ గా ఉండాలని దర్శకుడు శేఖర్ కమ్ముల భావిస్తున్నారట. ఇదే విషయాన్ని ధనుష్ కు చెప్పి, డంపింగ్ యార్డులో కీలక సన్నివేశాన్ని షూట్ చేయాలన్నారట. క్షణం ఆలోచించకుండా దర్శకుడు చెప్పినట్టుగానే చేస్తానని చెప్పారట ధనుష్. సుమారు 10 గంటలకు పైగా డంప్ యార్డులో షూటింగ్ కొనసాగించారట. చుట్టూ ముక్కులు పగిలేలా దుర్వాసన వస్తున్నా ధనుష్ అలాగే షూటింగ్ లో పాల్గొన్నారట. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదట. నటన పట్ల ఆయనకున్న డెడికేషన్ కు దర్శకుడితో పాటు చిత్రబృందం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.


యాక్షన్-అడ్వెంచర్ మూవీగా ‘కుబేర’


‘ఆడుకులం’ సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న ధనుష్.. సహజమైన లుక్స్, బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ తో పాత్రలకు ప్రాణం పోయడంలో ముందుంటాడు. అలాగే పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘కుబేర’ సినిమాలోనూ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నారట. ఇప్పటి వరకు లవ్, ఫ్యామిలీ డ్రామాతో సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల కూడా ‘కుబేర’ చిత్రంలో కొత్త జానర్ లోకి అడుగుపెడుతున్నారట. యాక్షన్- అడ్వెంచర్ మూవీగా దీనిని రూపొందిస్తున్నారట. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను చేస్తున్నారట. రీసెంట్ గా విడుదలైన నాగార్జున, ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. బ్లూ కలర్‌ షర్ట్‌, ఫార్మల్‌ ప్యాంటులో కళ్లజోడు పెట్టుకోని గొడుగుతో వర్షంలో నిలబడి ఉన్న లుక్‌ నాగార్జున కనిపించగా,  హీరో ధనుష్ లుక్‌ మూవీపై అంచనాలు భారీగా పెంచాయి. చిరిగిన దుస్తుల్లో బిచ్చగాడిలా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.


‘కుబేర’ సినిమాను సోనాల్ నారంగ్ సమర్పిస్తున్నారు. శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్‌ఎల్‌పి పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తుంది.  ధనుష్ రీసెంట్ గా 'అసురన్', 'కెప్టెన్ మిల్లర్' లాంటి సినిమాలో మంచి హిట్స్ అందుకున్నాడు.


Read Also: ‘జాతిరత్నాలు’ మూవీలో ఆఫర్ వచ్చినా ఫస్ట్ నో చెప్పిన ఫరియా అబ్దుల్లా, కారణం ఏంటో తెలుసా?