టీవీ సీరియల్ నటులు అమర్ దీప్-తేజస్వి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుక డిసెంబర్ 14న బెంగుళూరులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ అమర్ దీప్ జంటకు వెడ్డింగ్ విసెష్ చెప్తూ కామెంట్లు పెడుతున్నారు.






ఇక అమర్ దీప్-తేజస్విల పెళ్లికి బుల్లి తెరకు చెందిన పలువురు నటీనటులు, యాంకర్లు కూడా హాజరయ్యారు.  వీరి పెళ్లి గ్రాండ్ గా ఐదు రోజుల పండుగలా జరిగింది. ఈ వివాహ వేడుకల్లో మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫంక్షన్లు జరిగాయి. వీటితో పాటు బంధుమిత్రుల కోసం రిసెప్షన్ ను కూడా భారీగానే ఏర్పాటు చేశారు.






తెలుగు, కన్నడ, తమిళంలో బుల్లితెరపై మెరుస్తోన్న తేజస్విని గౌడ కన్నడ సీరియల్ 'బిలి హెండి'లొ తొలిసారిగా నటించింది. ఆ తర్వాత 'కోయిలమ్మ' సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' తమిళ సీరియల్‌తో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.







2016 లో షార్ట్ ఫిలింతో కెరీర్ స్టార్ట్ చేసిన అమర్ దీప్ ఆతర్వాత సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ సహా పలు వెబ్ సిరీస్ లో నటించాడు. 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ ఆడియన్స్ కి పరిచయమైన అమర్ సెకండ్ హీరోగా మెరిసి.. 'సిరిసిరి మువ్వలు' సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం, శైలజరెడ్డి అల్లుడు, సారధి, ఎవరు సినిమాల్లో నటించాడు. అమర్‌ దీప్‌ ప్రస్తుతం 'జానకి కలనగలేదు'లో హీరోగా నటిస్తున్నాడు. 





22 నవంబర్ 1995లో జన్మించిన తేజస్విని బెంగళూరులో పెరిగింది. రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో B.Eలో కళాశాల డిగ్రీ పూర్తి చేసింది. అనంతపురంలో జన్మించిన అమర్ దీప్ చౌదరికి చిన్నప్పటి నుంచీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బీటెక్ అయ్యాక, యూకేలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఓ ఏడాది సాఫ్ట్ వేర్ ఎడ్వైజర్ గా పనిచేసిన అమర్ చాలా డాన్స్ షోస్ లో పాల్గొన్నాడు.





Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు